CM Jagan
CM Jagan: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ లో ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నూ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. తమ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అనిచర్చంచుకుంటున్నా నేపథ్యంలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశాడు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ ల్ లో ఎన్నికలు ఉండే అవకాశం ఉందన్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ గురించి ప్రచారం చేయాలని కేడర్ కు పిలుపునిచ్చాడు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీలో మరికొద్ది నెలల్లో జరిగే ఎలక్షన్ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రారంభమైన ‘ఆరోగ్య సురక్ష’ ను ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఒక్కిరికీ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నవంబర్ 10 వరకు దీనిని చేపట్టాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో ప్రజలతో నాయకులు మమేకం కావాలని వారి సమస్యల పరిష్కారం పై చర్చించాలన్నారు. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా వివరాలను బోర్డులపై ఉంచాలన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధుల పెన్షన్ ను ప్రస్తుతం ఉన్న రూ.2,750ని రూ. 3000లకు పెంచాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు సాగుతుందన్నారు. జనవరి 10 నుంచి వైఎస్ ఆర్ చేయూత కార్యక్రమంలో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా సంబరం నిర్వహణకు సన్నద్ధం కావాలన్నారు. మొత్తం 60 రోజుల పాటు నియోజకవర్గంలోని మూడు ప్రాంతాల్లో మీటింగ్స్ఏర్పాటు చేయాలని, పేదలతో ఏకం కావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు అరెస్టుపై జగన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తన హయాంలో ఉండగానే సీబీఐ, ఈడీ సంస్థలు రాష్ట్రంలోకి వచ్చారని, కానీ ఆ సమయంలో వారిని రాకుండా అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు జైళ్లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా ఒకటేనన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు అంటూనే టీడీపీతో పొత్తు అని ప్రకటించారని, ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీని ఓడించలేవని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం మంది బీజేపీ శ్రేణులు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు సపోర్టు చేయడమంటే పేదలకు వ్యతిరేకంగా ఉండడమేనని జగన్ అన్నారు.