https://oktelugu.com/

‘పవర్ స్టార్’తో వర్మ లక్ష్యం నెరవేరుతుందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండేరేమో అంటే అతిశయోక్తి కాదేమో.. మెగాస్టార్ తమ్ముడిగా పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కొద్దిరోజుల్లోనే తనకంటూ ఓ ప్రత్యేక స్టార్డమ్ సాధించుకున్నాడు. కోట్లలో అభిమానులు కలిగిన హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. అందరి హీరోల కంటే కూడా పవన్ కి  వీరభిమానులు ఎక్కువగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇతర హీరోల ఆడియో ఫంక్షన్లలోనూ పవన్ నామస్మరణ చేస్తూ పలుమార్లు వారికి విసుగుతెప్పించిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 5:26 pm
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండేరేమో అంటే అతిశయోక్తి కాదేమో.. మెగాస్టార్ తమ్ముడిగా పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కొద్దిరోజుల్లోనే తనకంటూ ఓ ప్రత్యేక స్టార్డమ్ సాధించుకున్నాడు. కోట్లలో అభిమానులు కలిగిన హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. అందరి హీరోల కంటే కూడా పవన్ కి  వీరభిమానులు ఎక్కువగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇతర హీరోల ఆడియో ఫంక్షన్లలోనూ పవన్ నామస్మరణ చేస్తూ పలుమార్లు వారికి విసుగుతెప్పించిన సంఘటనలు అనేక ఉన్నాయి.

    టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?

    సినిమాల్లో నెంబర్ వన్ గా కొనసాగుతుండగానే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి వెంట పవన్ కల్యాణ్ కూడా నడిచాడు. యువరాజ్యం అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించాడు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం 18సీట్లు సాధించింది. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ పవన్ మళ్లీ సినిమాల వైపు వెళ్లాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.. చిరంజీవి కేంద్రమంత్రిగా పని చేయడం ఇదంతా అందరికీ తెల్సిందే..!

    ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలోనూ రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ-150తో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సత్తాచాటారు. ప్రస్తుతానికి చిరంజీవి క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలకు మంచిచేస్తే వారికి మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. ఇది తప్ప పెద్దగా రాజకీయాల జోలికి వెళ్లిన సంఘనలు మాత్రం ఇటీవలీకాలంలో ఎక్కడా కన్పించలేదు.

    చిరంజీవి రాజకీయాల్లో నుంచి పూర్తిగా సైడయ్యాక పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. పవన్ మద్దతు ఇచ్చిన కూటమి అప్పుడు అధికారంలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ టీడీపీ హయాంలో ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే సినిమాల్లో నటించేవాడు. కాగా కిందటి ఎన్నికల్లో జనసేన వందకు పైగా సీట్లలో పోటీచేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీచేసిన ఒక్కస్థానంలో గెలువకపోవడం ఆ పార్టీని కుంగదీసింది. అయినప్పటికీ పవన్ రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకొని ముందుకెళుతున్నాడు.

    మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!

    ప్రస్తుతం బీజేపీతో పొత్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి హవా ముందు టీడీపీ నిలువలేకపోతుంది. ఇలాంటి సమయంలోనే టీడీపీ నేతలు జనసేన, బీజేపీలోకి వలసలు కడుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు జనసేన కూటమి బలపడాలని ఆలోచిస్తున్న తరుణంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ మూవీతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకముందు మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రాంగోపాల్ తీశాడు. ఎన్నికల సమయంలో ఆ సినిమాల విడుదల చేయాలని భావించినా సాధ్యంకాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సినిమాను వర్మ రిలీజ్ చేసుకున్నాడు.

    తాజాగా పవర్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ‘పవర్ స్టార్’ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవర్ స్టార్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేశాడు. పవర్ స్టార్ రెండు పదాల మధ్యలో పవన్ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీలో కేవలం పాలిటిక్స్ మాత్రమే కాకుండా చాలా విషయాలను మిక్స్ చేస్తున్నట్లు కన్పిస్తుంది. ఫస్ట్ లుక్ తోపాటు వర్మ విడుదల చేసిన స్టిల్స్ లో పవన్ తోపాటు చిరంజీవి, త్రివిక్రమ్ పాత్రధారులు, చీర కట్టుకున్న రష్యన్ అమ్మాయి కూడా వర్మ చూపించాడు.

    పవన్ స్టార్ సినిమా ప్రకటించినపుడు పవన్ అభిమానులు వర్మను పెద్దగా పట్టించుకోలేదు. అయితే వర్మ మాత్రం పవన్ అభిమానుల సహనానికి పరీక్ష పెట్టేలా అతని చేష్టలున్నాయి. మొత్తానికి పవర్ స్టార్ సినిమా వర్మకు కావాల్సినంత వివాదాన్ని పంచేలా కన్పిస్తుంది. వరుసగా వివాదాస్పద అంశాలను సినిమాలుగా తెరకెక్కించి క్యాష్ చేసుకునే వర్మ పవర్ స్టార్ ఇమేజ్ ను కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. పవన్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వర్మను చెడుగుడు ఆడుకుంటున్నారు. వర్మ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. వర్మ విషయంలో పవన్ వీరాభిమానులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ఈ సినిమా వివాదంలో మున్ముందు ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే..!