AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఇందులో పలు అంశాలపై చర్చించనున్నారు. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాలు, టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం, దేవాదాయ స్థలాలు, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై, విశాఖ శారదా పీఠానికి భూమి కేటాయింపు, నూజివీడులో కేంద్రీయ కార్యాలయం, కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో చెరువులను నింపే ఎత్తిపోతల పథకం, మెడికల్ కళాశాలల ఏర్పాటుపై చర్చించే సూచనలున్నాయి.

దీంతో రాష్ర్టంలో చేపట్టబోయే పలు పనులపై చర్చించేందుకు కేబినెట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పలు పనులకు పచ్చ జెండా ఊపేందుకు నిర్ణయం తీసుకోనుంది. సినిమా టికెట్ల అమ్మకాలు, టీటీడీ సభ్యుల నియామకంపై పలు కోణాల్లో విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ వాటిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
సినిమా టికెట్ల విక్రయంపై అటు సినిమా, ఇటు ప్రతిపక్షంలో కూడా పలు ఆరోపనణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ పై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ లో చర్చించి వీటిపై ఏకగ్రీవంగా ఆమోదించేందుకు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దీంతో కేబినెట్ సమావేశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Also Read: Hyderabad Divorce Cases: పట్నంలో పెరుగుతున్న విడాకుల కేసులు.. దంపతుల మధ్య లోపిస్తున్న అనోన్యత..
మరోవైపు శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులో వైసీపీ కార్యాలయం కోసం ఎకరం 50 సెంట్లు భూమి కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేయడానికి నిర్ణయించింది. ఏపీలో జైనులు, సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కేబినెట్ మీటింగ్ లో చర్చించి అన్ని విషయాలపై ఏకగ్రీవ తీర్మానంతో పచ్చజెండా ఊపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Huzurabad bypoll : హుజూరాబాద్ లో.. బెట్టింగ్ బంగార్రాజులు! రేంజ్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..