Allu Arjun and Atlee movie: ‘పుష్ప 2’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ప్రముఖ తమిళ్ దర్శకుడు అట్లీ(Atlee) తో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గత ఏడాది డిసెంబర్ నెలకే ఈ సినిమా 40 శాతం కి పైగా టాకీ పార్ట్ ని పూర్తి చేసుకుంది. ఆ సమయం లోనే అల్లు అర్జున్ కి కొన్ని సన్నివేశాలు నచ్చకపోవడం, వాటిని మరోసారి రీ షూటింగ్ చేయించుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన షూటింగ్ పార్ట్ కి సంబంధించిన వర్క్ జరుగుతోంది. జూన్ లేదా జులై నెలలో లోపు అల్లు అర్జున్ భాగానికి సంబంధించిన టాకీ మరియు యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ చిత్రం లో దీపికా పదుకొనే(Deepika Padukone), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), జాన్వీ కపూర్(Jhanvi Kapoor) హీరోయిన్స్ గా నటిస్తుండగా, రష్మిక(Rashmika Mandanna) విలన్ గా నటిస్తోంది.
ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. రెండు సమాంతరమైనా ప్రపంచంలో ఉండే అన్నదమ్ముల స్టోరీ గా ఈ చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అట్లీ. రెండు సమాంతరమైనా ప్రపంచాలు అనగానే, మనకు నెట్ ఫ్లిక్స్(Netflix) లో పాపులర్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్(Stranger Things) గుర్తుకు రాక తప్పదు. ప్రస్తుత ప్రపంచానికి మరో డైమెన్షన్ లో ఉండే ఇంకో ప్రపంచం, అక్కడి నుండి డెమో గార్గన్స్ ప్రస్తుత ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చి మనుషులను చంపి వాళ్ళ రక్తం త్రాగడం వంటివి చేస్తుంటాయి. వీటి నుండి ఎలా ఈ చిత్రం లోని ప్రధాన పాత్రలు తమ ప్రపంచాన్ని రక్షిన్చుకున్నాయి, చీకటి ప్రపంచాన్ని ఎలా నాశనం చేసాయి అనేది స్టోరీ. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఈ సిరీస్ సాగుతుంది. రీసెంట్ గానే 5వ సీజన్ తో ఈ సిరీస్ ముగిసిపోయింది. అయితే, అల్లు అర్జున్, అట్లీ మూవీ స్టోరీ కూడా ఈ సిరీస్ స్టోరీ కి దగ్గరగా ఉంటుందట.
దీపికా పదుకొనే ఈ మూవీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మేకర్స్ ఒక వీడియో ని విడుదల చేశారు గుర్తుందా?, అందులో దీపికా పదుకొనే కార్టూన్స్ ని కొన్ని మనం చూడొచ్చు. ఆ కార్టూన్స్ లో దీపికా పదుకొనే క్యారక్టర్ డ్రాగన్స్ తో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. దానిని గమనిస్తే కచ్చితంగా ఈ సినిమా ‘స్ట్రేంజర్ థింగ్స్’ ని ప్రేరణగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు అనే విషయం అర్థం అవుతోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే ఈ సినిమా నుండి టీజర్, లేదా గ్లింప్స్ వీడియో వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ రెండవ పాత్ర నే సినిమాలో మెయిన్ విలన్ అట. ఇక ఆయన నట విశ్వరూపం ఈ చిత్రంలో ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోవచ్చు.