Actress Pragathi: టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను నటి ప్రగతి. తెలుగు సినిమాల్లో తల్లి, అత్త వంటి పలు పాత్రలకు పెట్టింది పేరు అన్నట్లు ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రగతి. లాక్ డౌన్ లో సోషల్ మీడియా లో పలు పోస్ట్ లతో తన ఫాలోవర్స్ ను పెంచుకున్నారు ఈమె. సోషల్ మీడియాలో కూడా ప్రగతికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యూత్ లో ప్రగతి ఓ రేంజ్ ఫాన్స్ ఉన్నారు అంటే నిజమానే చెప్పాలి. అయితే తాజాగా ప్రగతికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రగతి… సినిమా సెట్స్ లోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ సెట్స్ లో ప్రగతి, హీరో నవీన్ చంద్ర, పలువురు నటీనటులతో కలిసి మాస్ స్టెప్పులు వేసింది. బ్యాండ్ కొడుతుంటే ఉత్సాహంతో ప్రగతి డాన్స్ వాయడం సూపర్ గా ఉందని చెప్పాలి. చీరకట్టులో ప్రగతి వేసిన స్టెప్పులు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దాంతో ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో పాటు వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో బయటికి రావడంతో ఆమె అభిమానుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More