ఏపీ కేబినెట్ ప్రక్షాళన: వీళ్లు ఇన్. వీళ్లు ఔట్!?

ఏపీ సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే మొదటే హామీనిచ్చినట్టు ఈ మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకోనున్నారు. జగన్ గద్దెనెక్కగానే మంత్రివర్గంలోకి సీనియర్లను కాకుండా కొత్తవారిని, తెలియని ముఖాలను తీసుకొని సామాజికసమీకరణాల్లో దిగ్గజ నేతలైన రోజా, ధర్మాన, అంబటి, కరుణాకర్ రెడ్డి లాంటి సీనియర్లను పక్కనపెట్టారు. ఈ క్రమంలోనే సీనియర్లలో అసంతృప్తి జ్వాల భగ్గుమంది. ముక్కు మొహం తెలియని వారిని సామాజిక కోణంలో మంత్రులను చేయడం ఏంటన్న […]

Written By: NARESH, Updated On : June 4, 2021 9:03 am
Follow us on

ఏపీ సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే మొదటే హామీనిచ్చినట్టు ఈ మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకోనున్నారు. జగన్ గద్దెనెక్కగానే మంత్రివర్గంలోకి సీనియర్లను కాకుండా కొత్తవారిని, తెలియని ముఖాలను తీసుకొని సామాజికసమీకరణాల్లో దిగ్గజ నేతలైన రోజా, ధర్మాన, అంబటి, కరుణాకర్ రెడ్డి లాంటి సీనియర్లను పక్కనపెట్టారు. ఈ క్రమంలోనే సీనియర్లలో అసంతృప్తి జ్వాల భగ్గుమంది. ముక్కు మొహం తెలియని వారిని సామాజిక కోణంలో మంత్రులను చేయడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. అయితే జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. వీరి పదవీ కాలం రెండున్నరేళ్లు మాత్రమేనని.. ఆ తర్వాత మిగతా కొత్త వారిని తీసుకుంటానని అభయమిచ్చారు.

జగన్ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు వైసీపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం. ఎనిమిది మంది మంత్రులు తప్ప అందరినీ ఉద్వాసన పలికేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తొలి కేబినెట్ లో మంత్రులైన సీనియర్ ఎమ్మెల్యేలను జగన్ కొనసాగించబోతున్నారు. వారికి ఉద్వాసన పలకడం లేదు. సీనియర్లు కావడం.. బాగా అనుభవం ఉన్నవారు.. పనిచేస్తున్నవారు కావడంతో ప్రతిపక్షాలను ఢీకొట్టాలంటే వారి అనుభవం అవసరం అని జగన్ గుర్తించి వారిని కొనసాగించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

జగన్ కొనసాగించాలనుకుంటున్న సీనియర్ మంత్రుల్లో మొదటి పేరు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి జగన్ కు ఆర్థికంగా, వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి అండగా ఉంటున్నారు. అందుకే ఆయనను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఇక ఆ తర్వాత సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కూడా కంటిన్యూ కాబోతున్నారు. ఇక జగన్ కు సన్నిహితుడైన మంత్రి మేకపాటికి మరోసారి చాన్స్ ఇస్తున్నారు. జగన్ బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి మంత్రిగా కొనసాగబోతున్నారు. ఇక వీరే కాకుండా మంత్రులు అప్పలరాజు, చెల్లుబోయిన, సుచిరిత కూడా మరోసారి మంత్రులుగా కంటిన్యూ కాబోతున్నారు. ఈ మేరకు వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం.

ఇక పదవులు కోల్పోయే మంత్రుల జాబితా పెద్దగానే ఉంది. వారిలో ఎవరిని తీసేసి ఎవరిని తీసుకోవాలో కూడా కసరత్తు పూర్తయినట్టు సమాచారం.. వైసీపీ అధిష్టానం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వీరి స్థానంలో కొత్తగా కొత్త నేతలకు అవకాశం ఇవ్వబోతున్నారు.

-తొలగించే మంత్రులు- కొత్త మంత్రులు వీరే..

బుగ్గన రాజేంద్రప్రసాద్ స్థానంలో – శిల్ప చక్రపాణి రెడ్డి
ధర్మాన కృష్ణదాస్ -ధర్మాన ప్రసాద్ రావు
పేర్ని నాని – సామినేని
అనిల్ కుమార్ యాదవ్ -కారుమూరి నాగేశ్వరరావు
ఆళ్ల నాని -గ్రంథి శ్రీనివాస్
కురుసాల కన్నబాబు -దాడిశెట్టి రాజా
పుష్ప శ్రీవాణి – కళావతి పాలకొండ
అవంతి శ్రీనివాస్ -గుడివాడ అమరనాథ్
వెల్లంపల్లి – కోలగట్ల
అంజద్ భాష- ముస్తాఫా
నారాయణ స్వామి -కోరుముట్ల శ్రీనివాస్
శంకర్ నారాయణ-తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
ఆదిమూలపు సురేష్: కాకాని గోవర్ధన్ రెడ్డి
చెరుకువాడ -ముదునూరు ప్రసాద్ రాజు
తేనేటి వనిత -జొన్నలగడ్డ పద్మావతి
గుమ్మునూర్ జయరాం -అదోని సాయిప్రతాప్ రెడ్డి