https://oktelugu.com/

ఏపీ కేబినెట్: వరాలు కురిపించిన జగన్

ఏపీ కేబినెట్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.. ముఖ్యంగా ఏపీలో ఉచిత విద్యుత్ ఎత్తివేసి మీటర్లు బిగిస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటిలో ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని.. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రైతుపై ఒక్కపైసా భారం […]

Written By: , Updated On : September 3, 2020 / 02:37 PM IST
Follow us on

ఏపీ కేబినెట్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.. ముఖ్యంగా ఏపీలో ఉచిత విద్యుత్ ఎత్తివేసి మీటర్లు బిగిస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటిలో ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని.. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు.

వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.30-35 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేదని జగన్ అన్నారు. రైతు ఖాతాల్లో విద్యుత్ బిల్లు డబ్బులు వేస్తామని.. అదే డిస్కంలకు రైతులు కట్టాలని సీఎం జగన్ సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ పథకం అమలు కానున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిపారు. కేంద్రం సంస్కరణల వల్ల ఇలా నగదు బదిలీ తెస్తున్నామని వివరించారు.

కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని చంద్రబాబు అన్నారని.. కానీ బాబు మిగిల్చిన రూ.8వేల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం తీర్చిందన్నారు. రైతులకు ఎప్పటికీ అన్యాయం జరగనీయబోమని.. రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని జగన్ తెలిపారు.

*ఏపీ కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు
*పంచాయితీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్ మెంట్ పోస్టులకు ఆమోదం
*గుంటూరు, ప్రకాశం జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు
*విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం
*ఆన్ లైన్ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్ చట్టంలో సవరణలు
*పేకాట ఆడుతూ దొరికితే కఠిన శిక్షలు