హిట్ లేకపోతే ఒకప్పుడు వరుస హిట్స్ ఉన్న హీరో కూడా మార్కెట్ లేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. ప్రస్తుతం అల్లరి నరేష్ పరిస్థితి అదే. చాలా కాలం నుంచి హిట్ కోసం ఫైట్ చేస్తూ, హిట్ కొట్టలేక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తెలిపోతూ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు అల్లరి నరేష్. ఎట్టకేలకు అతి కష్టంమీద నరేష్ చేస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాని జీ5 ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎంతకు కొనింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరో పది రోజులు షూటింగ్ డేస్ బ్యాలెన్స్ ఉన్నాయట.
Also Read: ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి ?
కాగా ఆ పది రోజుల షూటింగ్ ను కూడా ఫినిష్ చేసి.. ఆ తరువాత ఈ సినిమాని జీ5లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాది శాడ్ ఎండింగ్ అని.. బాగా ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ చివర్లో అల్లరి నరేష్ పాత్ర చనిపోతుందని.. సెంటిమెంట్ పీపుల్స్ కి ఈ సినిమా ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇక అల్లరి నరేష్ కూడా ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అందుకే పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో పూర్తిగా నగ్నంగా కనిపించడానికి కూడా అంగీకరించాడు. అల్లరి నరేష్ లాంటి హీరోకి ఇలాంటి పాత్ర చేయాల్సిన అవసరం లేదు, కానీ కేవలం కథ బాగా నచ్చి నరేష్ రెమ్యునరేషన్ ను కూడా తగ్గించుకుని ఈ సినిమాని చేశాడు. అందుకే విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: వయసు ముదిరినా తరగని అందం..
దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ కి కూడా విపరీతమైన స్పందన వచ్చింది. టీజర్ వల్లే.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. కెరీర్ లో ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసి తనకంటూ ఓ మిడియమ్ రేంజ్ మార్కెట్ సృష్టించుకున్న అల్లరి నరేష్.. కెరీర్ మొదట్లోనే నేను, ప్రాణం సినిమా లాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా చేశాడు. కానీ, ఆ సినిమాలేవి నరేష్ కి సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. అయితే గతంలో కూడా గమ్యం, శంభో శివ శంభో’ లాంటి చిత్రాలు నరేష్ కి మంచి పేరు తెచ్చి పెట్టాయి. కానీ ఈ సినిమాల్లో హీరో నరేష్ కాదు, కేవలం నరేష్ హీరోగా వచ్చిన ఇలాంటి చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. మరి ఇప్పుడు ఇలాంటి సినిమాతో నరేష్ ఎలా హిట్ కొట్టగలడో చూడాలి.