AP Cabinet key decisions: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అదే సందర్భంలో ఓ కీలక వ్యాఖ్య చేశారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నాం. తెలంగాణ, ఏపీ ఒకటే రాష్ర్టం కదా. సీఎం జగన్ కూడా అదే కోరుకుంటున్నారు. సీఎ: కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే రెండు ప్రాంతాలు ఒకటే అనే పిలుచుకోవచ్చు కదా అని చెప్పడం గమనార్హం. ఏపీలో ప్రభుత్వం చేపట్టబోయే పనుల గురించి మంత్రి వివరించారు.

దీంతో మంత్రి నాని వ్యాఖ్యలకు అందరు ఆశ్చర్యపోతున్నారు. సీఎం కేసీఆర్ పై ఆయన చెప్పిన మాటలకు ఇరు ప్రాంతాల్లో ఆలోచనలు మొదలయ్యాయి. ఉద్దేశపూర్వకంగా అన్నారా? లేక నోరు జారారా అని ఆరా తీస్తున్నారు. మరోవైపు రాష్ర్టంలో విద్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్తగా 1285 ఉద్యోగాల కోసం మంత్రివర్గం ఆమోదించింది. అర్బన్ హెల్త్ క్లినిక్స్ లో 560 ఫార్మాసిస్టులు, వైద్య కళాశాలల్లో 2190 మందని నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాష్ర్టంలో కుల గణన జరపాలని నిర్ణయించారు. మావోయిస్టులపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడు మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరాకు త్రైపాక్షిక ఒప్పందానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఓడరేవు సహా ఐదు షిప్పింగ్ హార్బర్ల , డీపీఆర్ లకు ఆమోదం తెలిపింది.
Also Read: Huzurabad bypoll : హుజూరాబాద్ లో.. బెట్టింగ్ బంగార్రాజులు! రేంజ్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
ఏపీ అసెంబ్లీలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదం లబించింది. ఆన్ లైన్ టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై ఆర్డినెన్స్ కు సభ ఆమోదం తెలిపింది. దేశాదాయ శాఖలో కూడా పలు మార్పులకు నాంది పలికింది. దీంతో రాష్ర్టంలో పలు పనుల కోసం ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో అన్ని పనులకు గ్రీన్ సిగ్నల్ లబించింది.
Also Read: AP Govt: అదానికి 130 ఎకరాలు అప్పగించేసిన జగన్ సర్కార్