AP Cabinet Expansion: జగన్ కేబినెట్ లో కొత్త వారెందరు? పాత వారెందరు?

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. ఇందుకోసం 24 మంది మంత్రులను రాజీనామాలు చేయించారు. కొత్త మంత్రివర్గం ఈనెల 11న కొలువుదీరనుంది. దీని కోసం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత మంత్రుల్లో అందరిని కాకుండా కొందరిని తీసి మరికొందరికి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుత కేబినెట్లోని 7-11 మందిని కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జగన్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలే లక్ష్యంగా […]

Written By: Srinivas, Updated On : April 8, 2022 1:56 pm
Follow us on

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. ఇందుకోసం 24 మంది మంత్రులను రాజీనామాలు చేయించారు. కొత్త మంత్రివర్గం ఈనెల 11న కొలువుదీరనుంది. దీని కోసం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత మంత్రుల్లో అందరిని కాకుండా కొందరిని తీసి మరికొందరికి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుత కేబినెట్లోని 7-11 మందిని కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.

AP Cabinet Expansion

రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జగన్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 2024 ఎన్నికల్లో సీనియర్లు లేకుంటే కష్టాలు వస్తాయనే ఉద్దేశంతో పీకే సూచనలతో కొందరు సీనియర్ మంత్రులను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. పదవులు కోల్పోతున్న వారికి కూడా కేబినెట్ హోదా కల్పించే విధంగా పదవులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Also Read: Harassing Phone Calls: ఆకతాయిని చెప్పుతో కొట్టిన యువతులు.. ఏం జరిగిందంటే?

దీంతో కొత్తవారు 14-15 మంది ఉండనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక మంత్రివర్గంలో సీనియర్లలో పెద్దిరెడ్డి, కొడాలి నాని, బొత్స, పేర్ని నాని, బాలినేని, జయరాం, చెల్లుబోయిన వేణు, ఆదిమూలపు సురేష్, అప్పలరాజు, శ్రీరంగనాథ రాజు లు కొనసాగవచ్చని విశ్వసనీయ సమాచారం. బుగ్గన పేరు ఉంటుందో లేదో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గ కూర్పుపై జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

AP Cabinet Expansion

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మంత్రివర్గ విస్తరణపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆశావహుల్లో కూడా ఆందోళన మొదలైంది. తమకు పదవులు దక్కుతాయో లేదోననే సందేహంలోనే ఉన్నారు. తుది జాబితాలో ఎవరికి చోటు దక్కుతుందో తెలియడం లేదు. ఈ క్రమంలో మంత్రిపదవులపై ఇప్పటికే కోటి ఆశలతో ఉన్న వారందరిలో ఒకటే ఆతృత పెరుగుతోంది. కేబినెట్ లో ఎవరికి స్థానం దక్కుతుందో ఎవరికి చేయి ఇస్తారో కూడా అంతుచిక్కడం లేదు.

Also Read:KCR Mark: వరి పోరుకు కేసీఆర్ మార్క్ ‘శుభంకార్డ్’ పడనుందా?

Tags