Samantha- Siddharth: స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా హైలెట్ అయిపోతుంది. గత పదేళ్లుగా ఆమె సినీ కెరీర్ చాలా ట్విస్ట్ లతో కూడుకొని ఉంది. తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌తో ప్రేమ అప్పట్లో సౌత్ ఇండస్ట్రీ లో సంచలనం రేపింది. దాదాపు వీరి పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. ఎందుకంటే అంతలా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. అప్పట్లో ఏ పార్టీలో చూసినా వీరిద్దరు జంటగా కనిపించేవారు.

తర్వాత వీరిద్దరూ విడిపోవడం.. సమంత నాగ చైతన్య కు దగ్గర కావడం చకచకా జరిగిపోయాయి. సిద్ధార్థతో ప్రేమ వరకే ఆపేసిన సమంత.. చైతుతో మాత్రం ఏడడుగులు వేసింది. ఇక నాలుగేళ్ల కాపురం తర్వాత వీరిద్దరూ విడిపోవడం ఎంత పెద్ద సంచలనం రేపందో చూశాం. విడాకులు తీసుకున్న తరువాత సమంత వరుస పెట్టి పెద్ద ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తన మాజీ ప్రియుడు సిద్ధార్థతో కలిసి సమంత నటించిన జబర్దస్త్ మూవీ నేటికి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Also Read: Harassing Phone Calls: ఆకతాయిని చెప్పుతో కొట్టిన యువతులు.. ఏం జరిగిందంటే?
ఈ మూవీ విషయంలో అప్పట్లో చాలా పెద్ద కథ నడిచింది. ఈ మూవీ సమయంలో సమంత సిద్ధార్థ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. వీరిద్దరూ కలిసి శ్రీకాళహస్తిలో రాహు- కేతు పూజలు కూడా నిర్వహించడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ మూవీపై వచ్చిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అలా మొదలైంది సినిమా హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నందిని రెడ్డి.. సమంత సిద్ధార్థను పెట్టి జబర్దస్త్ మూవీని తెరకెక్కించింది.

అయితే ఈ మూవీ బాలీవుడ్ సినిమా అయిన బ్యాండ్ బాజా బరాత్.. కథకు కాపీలా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఆ సినిమాను మక్కీకి మక్కీ నందినిరెడ్డి తెరకెక్కించిందంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్ లు కోర్టుకెక్కారు. దీంతో కోర్టు ఈ సినిమాను టీవీలు, డివిడిల్లో ప్రసారం చేయడానికి వీల్లేదంటూ తీర్పు ఇచ్చింది. చివరకు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ చాలా చర్చలు జరిపి ఈ సమస్య నుంచి బయటపడ్డారు.
Also Read:Bigg Boss Telugu OTT: విన్నర్ విషయంలో సీక్రెట్ మెయింటేన్ చేస్తున్న బిగ్ బాస్.. అతను గెలిచే ఛాన్స్..