AP Cabinet Expansion: ఏ ముఖ్యమంత్రి అయినా శాఖపరంగా మంచి పనితీరు కనబరిచే మంత్రులను నియమిస్తారు. సీనియర్ల సేవలను వినియగింకుంటారు. ఒక వేళ మంత్రివర్గ విస్తరణ చేపట్టి.. కొత్తవారికి అవకాశమివ్వాలంటే ఒకరిద్దర్ని మార్చుతారు. మరి మన జగన్ గారు మిగతా ముఖ్యమంత్రుల శైలికి విరుద్ధం కదా.. అందుకే మొత్తం అందర్నీ మార్చి కొత్తవారిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది సీనియర్ మంత్రులకు మింగుడు పడడం లేదట. ఆది నుంచి సీఎం జగన్ కు భజన చేసే మంత్రులు సైతం ఇదేం తీరు అని ప్రశ్నిస్తున్నారు. అంతులేని, అపూర్వ విజయంతో తలకెక్కి జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అసంతుష్ట నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో మార్పు తధ్యమని సమాచారమందుకున్న మంత్రులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని తొలగించడం ఖాయమని పాలకపక్షంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావుతోపాటు, అనంత వెంకట్రామిరెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందా లేదా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్ కూర్పు ఉంటుందని జగన్ విస్పష్టంగా చెప్పినా.. కొందరు మంత్రులు మాత్రం తమను కొనసాగిస్తారన్న ఆశతో ఉన్నారు. తమను కొనసాగించాలంటూ సీఎంకే సిఫారసులు చేస్తున్నారు.
Also Read: Minister Anil Kumar Yadav: ఆ నోరు వినిపించదేం?.. సైలెంట్ అయిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్
మంత్రి గుమ్మనూరు జయరాం తరుపున కర్ణాటకకు చెందిన మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి మంత్రాంగం నడుపుతున్నట్టు సమాచారం. తొలి మంత్రివర్గ విస్తరణ సమయంలో అనుభవజ్ఞులైన ధర్మాన, ఆనం పేర్లు వినిపించాయి. కానీ వారు గతంలో చేసిన కామెంట్లు, సీనియర్లుగా వారిని తీసుకుంటే కలిగే ఇబ్బందులతో జగన్ వారికి దూరం పెట్టారు. విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై కత్తులు దూసి అసెంబ్లీలో సస్పెన్షన్ కు గురైన నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అప్పట్లోనే అందరూ భావించారు. ఇప్పుడు కొత్తవారితో పాటు ఆమె కూడా మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పడుతున్నారు. తాజా గా ఆమెకు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి మధ్య పోటీ ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ఉత్తరాంధ్రలో కొమ్ములు తిరిగిన నేతలు ఎందరున్నా.. అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్‌కు మంత్రివర్గంలో స్థానం గ్యారెంటీ అనే మాట బలంగా వినిపిస్తోంది. . మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తిగా ముఖ్యమంత్రి అభీష్టమని సీనియరు మంత్రులు బహిరంగ వేదికలపై చెబుతున్నా.. కొందరు మాత్రం లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించి.. బాలినేనిని తొలగించాలన్న యోచనలో సీఎం ఉన్నారని వైసీపీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతోంది.

దీనిపై బాలినేని అసంతృప్తితోనే ఉన్నారని, ఇద్దరినీ మంత్రులుగా కొనసాగించాలని… లేదంటే ఇద్దరూ కొత్తవారే ఉండాలని జగన్‌తో బాలినేని అన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం తన మనసులో మాట తెగేసి చెప్పారని.. పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకోవాలని బాలినేనికి స్పష్టం చేశారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. విజయనగరానికి చెందిన బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం క్రిష్ణదాస్, పార్వతీపురం మన్యానికి చెందిన పాముల పుష్పశ్రీవాణి తమ పదవులను వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. శాఖ పరంగా మెరుగైన
ఆశావహులు వీరే..
మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకం ఉంటుందని.. వెనుకబడిన తరగతులు, ఎస్సీలకు పెద్దపీట వేయనున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటన నేపథ్యంలో ఎవరికి వారు తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం గట్టి పోటీదారులుగా నిలుస్తున్నారు.
ఇందులో ధర్మాన పోలినాటి వెలమ, తమ్మినేని కళింగ సమాజికవర్గానికి చెందిన వారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విశ్వసరాయి కళావతి, పీడిక రాజన్నదొర పోటీదారులుగా ఉన్నారు. ఇద్దరూ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారే. అనకాపల్లి జిల్లా నుంచి గుడివాడ అమరనాథ్ , బూడి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ ఉన్నారు. ఇందులో అమరనాథ్, ధర్మశ్రీలు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. అల్లూరి జిల్లా నుంచి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణలు పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఎస్టీ వర్గానికి చెందిన వారే. విజయనగరం జిల్లా నుంచి కంబాల జోగులు , బొత్స అప్పల నరసయ్యలు, కాకినాడ జిల్లా నుంచి దాడిశెట్టి రాజా , పెండెం దొరబాబు , రాజమహేంద్రవరం నుంచి టి.వెంకటరావు, కోనసీమ నుంచి విశ్వరూప్, చెల్లుబోయిన వేణు , పొన్నాడ సతీశ్, ఏలూరు జిల్లా నుంచి బాలరాజు,ఎలీజా, అబ్బయ్యచౌదరి , మేకా ప్రతాప వెంకట అప్పారావు , పశ్చిమగోదావరి నుంచి ముదునూరు ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు , కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారథి , జోగి రమేశ్ , ఎన్‌టీఆర్ జిల్లా నుంచి సామినేని ఉదయభాను, రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్, గుంటూరు జిల్లా నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి , బాపట్ల నుంచి మేరుగ నాగార్జున, కోన రఘుపతి, పల్నాడు నుంచి విడదల రజని , బ్రహ్మనాయుడు, ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేశ్, అన్నే రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్,టీజేఆర్ సుధాకరబాబు, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి , కర్నూలు జిల్లా నుంచి హఫీజ్‌ఖాన్, అన్నమయ్య జిల్లా నుంచి గడికోట శ్రీకాంతరెడ్డి, నవాజ్‌పాషా, నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నంద్యాల జిల్లా నుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆశావహులుగా ఉన్నారు. వీరిలో ఎవరికి అమాత్య పదవి దక్కుతుందో చూడాలి మరీ.
Also Read:Congress Protest: కాంగ్రెస్ దండు కదిలింది.. ధరలపై యుద్ధం మొదలైంది
[…] Also Read: ఎక్కడైనా ఉందా ఈ చోద్యం.. తమను తప్పించడ… […]