AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణపై కొద్ది రోజులుగా నాన్చుతోంది. దీంతో ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఎన్నో రోజులుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశిస్తున్నా వారి ఆశలు తీరేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియడంతో ఎమ్మెల్యేల్లో పదవులపై ఆసక్తి కనబరుస్తోంది. మంత్రివర్గ విస్తరణ చేపడితే కులాల సమీకరణలు ప్రత్యేకంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే ఉన్న 90 శాతం మందికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు.
సామాజిక సమీకరణల నేపథ్యంలో కొందరికి పదవి దక్కదనే తెలుస్తోంది. సీనియారిటీ ప్రకారం కొడాలి నానికి మాత్రం పదవి ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి. పార్టీలో ఉన్న మంత్రుల్లో నానికి ప్రత్యేక స్థానం ఇస్తున్నట్లు జగన్ విధానాల ద్వారా అర్థమవుతోంది. దీంతో రాబోయే మంత్రివర్గ విస్తరణలో అధినేత ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు. పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు అంటే నాని అని అందరికి తెలిసిందే.
Also Read: చార్మినార్‌పై కవిత బర్త్ డే ఫ్లెక్సీ వివాదం.. ఆ ఏరియా అధ్యక్షుడిపై కేసు..
ప్రస్తుతం వైసీపీలో దమ్మున్న నేతగా నానికి గుర్తింపు ఉంది. దీంతో ఆయనను మంత్రిగా కొనసాగించేందుకే జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గంలో కూడా ఫైర్ బ్రాండ్ అయిన నేత లేకపోవడంతో నానికే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సంబంధం దృష్ట్యా నానికి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీకి నాని అవసరం కూడా ఉంది. ప్రత్యర్తి పార్టీలను కంట్రోల్ చేసే సత్తా ఆయనకే ఉందని నమ్ముతున్నారు. చంద్రబాబు, లోకేష్ లపై కూడా నాని చేసిన ఆరోపణలు ఇంతవరు ఎవరు చేయలేదు. దీంతో నానికే మంత్రి పదవి ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నానికి ఎన్ని బలహీనతలున్నా కూడా ఆయనను మంత్రివర్గంలో కొనసాగించేందుకే జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా కమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రఘురాం జగన్ కు సన్నిహితుడు కావడంతో నానిని కాదనుకుంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదొక్కటే మైనస్ పాయింట్ గా తెలుస్తోంది. కానీ నానిని దూరం పెట్టేందుకు జగన్ సిద్ధంగా లేనట్లు సమాచారం. నాని మాట్లాడితే అసభ్యపదజాలం ఎక్కువగా ఉండి అసభ్యకరంగా ఉంటుంది. దీంతో ఇదే ఆయనకు బలహీనత గా భావిస్తారు. నానికి బలం ఆయన మాటలు బలహీనత ఆయన అసభ్య పదజాలమే అని చెబుతున్నారు.
Also Read: ఏపీలో మద్యనిషేధానికి మంగళం.. పిండుకోవడమే మిగిలింది