https://oktelugu.com/

Bollywood Trends : బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్

Bollywood Trends : బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. క‌చ్చా బాద‌మ్ పాట ఫేం భుబ‌న్ బ‌ద్యాక‌ర్ తనకు సెల‌బ్రిటీ హోదా వచ్చిందని.. డబ్బులు కూడా బాగానే వ‌చ్చాయని,. దీంతో ఇక తాను ప‌ల్లీలు అమ్మనని పేర్కొన్నాడు. దీనిపై ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీ కాగానే.. అన్నం పెట్టిన ప‌నిని ఎలా వ‌దిలేస్తారు అంటూ నెటిజ‌న్లు ప్రశ్నించారు. దీనిపై ఓ ఫంక్షన్లో మాట్లాడిన భుబ‌న్.. సెల‌బ్రిటీ హోదా ఉన్నా ప‌ల్లీలు అమ్ముతాన‌ని, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 13, 2022 / 03:30 PM IST
    Follow us on

    Bollywood Trends : బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. క‌చ్చా బాద‌మ్ పాట ఫేం భుబ‌న్ బ‌ద్యాక‌ర్ తనకు సెల‌బ్రిటీ హోదా వచ్చిందని.. డబ్బులు కూడా బాగానే వ‌చ్చాయని,. దీంతో ఇక తాను ప‌ల్లీలు అమ్మనని పేర్కొన్నాడు. దీనిపై ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీ కాగానే.. అన్నం పెట్టిన ప‌నిని ఎలా వ‌దిలేస్తారు అంటూ నెటిజ‌న్లు ప్రశ్నించారు. దీనిపై ఓ ఫంక్షన్లో మాట్లాడిన భుబ‌న్.. సెల‌బ్రిటీ హోదా ఉన్నా ప‌ల్లీలు అమ్ముతాన‌ని, ఇటీవల ప‌ల్లీలు అమ్మనన్నందుకు క్షమాప‌ణ‌లు తెలుపుతున్నా అన్నాడు.

    kacha badam singer bhuban

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌ దిగ్గజ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. 1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన హత్యాకాండ ఈ మూవీ స్టోరీ. నిన్న రిలీజైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. సినిమా చూసిన ఒక మహిళ భావోద్వేగంతో బయటికి రాగానే అక్కడే ఉన్న డైరెక్టర్ వివేక్ కాళ్లు పట్టుకొని ఏడ్చేసింది. డైరెక్టర్, హీరో కంటతడి పెట్టుకున్నారు.

    Also Read:  త్రివిక్రమ్ అడ్డు లేదు.. ఇక అందర్నీ వచ్చేయమంటున్నాడు

    the kashmir files

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్ శ్రుతి’. ఇటీవల విడుదలైన ఈ మూవీ తెలుగు టీజర్‌‌లో కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్స్ చిత్రంపై ఆసక్తి పెంచాయి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తమిళ టీజర్లను రిలీజ్ చేశారు.

    My Name Is Shruthi

    ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా చూస్తున్నంత సేపు ఉత్కంఠ ఉంటుందన్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ తేదీ డిక్లేర్ చేస్తామన్నారు.

    Also Read: అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ఇప్పుడు హీరో అయ్యాడండోయ్..

    Tags