AP Politics: ఆంధ్రప్రదేశ్ లో అధికారమే లక్ష్యంగా పార్టీల ప్లాన్లు?

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. జనసేన ఆవిర్భావ సభలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తీకి తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పడంతో ఆయన బీజేపీతో కలిసి నడిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే సందర్భంలో వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ప్రకటించడంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీకి అధికార భయం పట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగ గట్టెక్కాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆసక్తి నెలకొంది. […]

Written By: Srinivas, Updated On : March 15, 2022 3:18 pm
Follow us on

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. జనసేన ఆవిర్భావ సభలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తీకి తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పడంతో ఆయన బీజేపీతో కలిసి నడిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే సందర్భంలో వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ప్రకటించడంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీకి అధికార భయం పట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగ గట్టెక్కాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

AP Politics:

2024లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే వైసీఎల్ పీ సమావేశం నిర్వహిస్తోంది. దీంతో పార్టీని గెలిపించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు కూడా శ్రీకారం చుట్టనున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో ఆశావహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కానీ రాష్ట్రంలో అభివృద్ధి పనులు మాత్రం కొండెక్కడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

Also Read: వెంటపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను వేటాడుతున్న కేసీఆర్!

రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్ చూస్తున్నా అది అంత సులువు కాదని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలను తుదముట్టించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీని ఢీకొనాలని యోచిస్తోంది. ఇప్పటికే వైసీపీ అప్రదిష్ట మూటగట్టుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పార్టీపై అందరిలో అసంతృప్తి ఏర్పడింది. ఈ క్రమంలో వైసీపీ కి ఎదురుదెబ్బలే తగలనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ వ్యూహంలోనే భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుస్తున్నట్లు నిన్న జరిగిన సభలో తేటతెల్లమైంది. దీంతో రాష్ట్రంలో వైసీపీకి ఇక కష్టకాలమే అని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో జగన్ ఎన్ని వ్యూహాలు పన్నినా ఓటర్లు కనికరించరని సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. రూ. లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తుండటంతో ప్రజల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది.

AP Politics

దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన మైత్రితో కొత్త అధ్యాయం లిఖించనునన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తో పొత్తుతో బీజేపీ తన కల నెరవేర్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ కొద్ది రోజులుగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసమే అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఫామ్ లో ఉండటంతో ఏపీలో కూడా నత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తన్నట్లు తెలుస్తోంది.

Also Read: టీకాంగ్రెస్‌లో అసంతృప్త రాజ‌కీయాలు.. పంజాబ్‌ను చూసైనా మారండ‌య్యా..!

Tags