Homeఆంధ్రప్రదేశ్‌AP Cabinet Expansion: జ‌గ‌న్ వేటు వేసేది వారి మీదేనా.. సామాజిక వ‌ర్గాల ఆధారంగానే మార్పు..?

AP Cabinet Expansion: జ‌గ‌న్ వేటు వేసేది వారి మీదేనా.. సామాజిక వ‌ర్గాల ఆధారంగానే మార్పు..?

AP Cabinet Expansion: మొన్నటి వరకు కొంత మాత్రమే చర్చ సాగిన మంత్రివర్గ ప్రక్షాళన.. ఇప్పుడు వైసీపీ లో హాట్ టాపిక్ అయింది. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో జగన్ స్వయంగా మంత్రివర్గ ప్రక్షాళన గురించి స్పందించారు. అయితే అందరినీ మార్చటం లేదని కొందర్ని మారుతున్నట్టు తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఇదే వైసీపీలో కలకలం రేపుతోంది. మంత్రివర్గ పక్షాలన గురించి కేబినెట్లో చర్చించిన విషయాలను కావాలనే మీడియాకు లీక్ చేశాయి వైసీపీ వర్గాలు.

AP Cabinet Expansion
CM JAGAN

అయితే తొలగించిన మంత్రులను పార్టీ జిల్లాల అధ్యక్షులుగా చేస్తామంటూ జగన్ చెబుతున్నారు. ఎలాగూ కొత్త జిల్లాలు ప్రకటించారు కాబట్టి.. ఆ జిల్లాల అధ్యక్ష పదవులు ఇప్పుడు జగన్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. తొలగించిన మంత్రులను బుజ్జగించేందుకు ఆ పదవులను జగన్ వాడుకునే అవకాశం ఉంది. అయితే కొందరిని మంత్రులుగా కొన‌సాగించ‌డానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాలు, ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నేతలు, వ్యూహాలు పండడంలో దిట్ట అయిన సమర్థులను జగన్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:  కాంగ్రెస్ ‘హస్తం’ ఖతం.. దాన్నుంచే ఆమ్ఆద్మీ ‘చీపురు’ పుట్టుకొస్తోందా? పేలుతున్న మీమ్స్

ఏపీలో బలమైన సామాజిక వర్గాలు కమ్మ, కాపు, రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గాలకు జగన్ పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ఈ వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ వర్గాలకు చెందిన మంత్రులను జగన్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పైగా ఇన్ని రోజులు ఈ వర్గాల మంత్రులే జగన్ కేబినెట్ లో కీలకంగా పనిచేస్తున్నారు. కాబట్టి వీరిని పక్కనపెట్టి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, కేబినెట్ లో పెద్దగా గుర్తింపు లేని వారిని జగన్ తొలగించనున్నట్లు సమాచారం.

AP Cabinet Expansion
CM Jagan

కేబినెట్ లో ఈ తరహా మంత్రులే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. జగన్ తాను మంత్రి పదవి నుంచి తీసేసినా పార్టీని, పార్టీ లైన్ ను వీడని వారి మీద‌నే వేటు వేయ‌నున్న‌ట్టు స‌మాచారం. వీరికి జిల్లాల అధ్యక్ష బాధ్యతల నుంచి పని చేయించుకోవాలని జగన్ భావిస్తున్నారు. కాకపోతే జగన్ అంచనాలు నిజమవుతాయంటే చెప్పలేము. పదవి తీసేస్తే చాలామంది గ్రూపు రాజకీయాలకు తెర తీసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. జగన్ నిర్ణయంతో ఇవి మరింత పిక్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్ ఈ అడ్డంకులను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.

Also Read:  అసెంబ్లీలో స్పీకర్ పై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version