AP Cabinet Expansion Effect: మంత్రివర్గ విస్తరణ ఎఫెక్ట్.. నిట్టనిలువునా చీలిన బొత్స కుటుంబం

AP Cabinet Expansion Effect: ఆ జిల్లా అంతటా ఆయన బంధువులే ప్రజాప్రతినిధులు. ఆయన మాటే వారికి వేదవాక్కు. పార్టీ ఏదైనా ఆయనదే హవా. విపక్షంలో ఉన్నా చెరగని ముద్రే. జిల్లా రాజకీయాలను ఇట్టే శాసించలరు. అటువంటిది ఆయన పరిస్థితి తలకిందులైంది. గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో సైతం రాజకీయ ఆధిపత్యం ప్రారంభమైంది. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించి ఎందరికో దారిచూపిన ఆయన సొంతింటినే చక్కదిద్దుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా.. ఆయననేండి మన విజయనగరం బాద్ షా […]

Written By: Admin, Updated On : April 7, 2022 9:27 am
Follow us on

AP Cabinet Expansion Effect: ఆ జిల్లా అంతటా ఆయన బంధువులే ప్రజాప్రతినిధులు. ఆయన మాటే వారికి వేదవాక్కు. పార్టీ ఏదైనా ఆయనదే హవా. విపక్షంలో ఉన్నా చెరగని ముద్రే. జిల్లా రాజకీయాలను ఇట్టే శాసించలరు. అటువంటిది ఆయన పరిస్థితి తలకిందులైంది. గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో సైతం రాజకీయ ఆధిపత్యం ప్రారంభమైంది. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించి ఎందరికో దారిచూపిన ఆయన సొంతింటినే చక్కదిద్దుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా.. ఆయననేండి మన విజయనగరం బాద్ షా బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం మంత్రి పదవికి దూరమవుతున్న ఆయనకు ముందు సవాళ్లు ఎన్నో ఉన్నాయి.

AP Cabinet Expansion Effect

విజయగనగరంలో గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అనతికాలంలోనే ఎదిగారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పీసీసీ అధ్యక్షుడిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జగన్ సర్కారులో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్, మరో సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు (మేనకోడలు భర్త) నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో బొత్సకు సహజంగానే అధిష్టానం వద్ద పరపతి పెరిగింది. అందుకే జగన్ కు ఇష్టం లేకున్నా తన కేబినెట్ లో బొత్సకు మంచి శాఖనే కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడు సీనియర్లందర్నీ మార్చాల్సి రావడంతో భొత్సను తప్పించే ఛాన్స్ జగన్ కు వచ్చింది. అయితే సహజంగా బలవంతుడైన బొత్స దీనికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. కానీ ఎందుకో ఆయన అయిష్టంగానే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఆయన నిస్సహాయత వెనుక భారీ వ్యూహమే నడిచిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read: AP Cabinet Expansion: ఏపీలో కొత్త మంత్రివర్గంపై కొనసాగుతున్న కసరత్తు

చాలా రోజుల కిందట నుంచే బొత్సను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు జగన్. ఇందుకు విజయసాయిరెడ్డిని పావుగా వాడారు. పేరుకే బొత్సకు మంత్రి పదవి ఇచ్చారు కానీ.. ఆయనకు ఎటువంటి పవర్ ఇవ్వలేదు. విజయనగరం జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో వెలి పెట్టనివ్వలేదు. పైగా బొత్స కుటుంబంపై విజయసాయిరెడ్డి ఫోకస్ పెట్టారు. వారిలో విభేదాలను వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైతం మంత్రి బొత్స కీలక పోర్టుపోలియోలు నిర్వహించారు. ఆ సమయంలో బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ ఎంపీగా కూడా ఉండేవారు. కుటుంబసఃభ్యులు ఎమ్మెల్యేలుగా వ్యవహరించేవారు. దీంతో మంత్రి పదవితో బిజీగా ఉన్న బొత్స జిల్లా బాధ్యతలను మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు. ఆయనో షాడోనేతగా ఎదిగిపోయారు.

కుటుంబం మొత్తం ఒకటిగా ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారిపోయింది. షాడో నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు జడ్పీ పీఠంపై కూర్చున్నారు. అప్పటి నుంచి మజ్జి శ్రీనివాసరావు సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా మేనమామలు కంటే, సోదరి భర్త అయిన నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో వర్గం కట్టారు. అయితే అప్పటికే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ మరో సోదరుడు లక్ష్మణరావు జో్క్యం అధికమైందని అధిష్టానంతో పాటు ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి విజయసాయిరెడ్డికి నేరుగా ఫిర్యాదులు ఇప్పించారు. దీంతో కొద్దిరోజుల పాటు వివాదం నెలకొంది. బొత్స సత్యనారాయణ జోక్యంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా మంత్రివర్గ విస్తరణ పుణ్యమా అని ఇప్పుడు ఆ కుటుంబంలో పెద్ద రచ్చే జరుగుతోంది.

AP Cabinet Expansion Effect

తనను మార్చడం అనివార్యమైతే సోదరుడు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యకు అవకాశమివ్వాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు అవకాశమివ్వాలని మజ్జి శ్రీనివాసరావు కోరుతున్నారు. ఒకే తాటిపై ఉండి రాజకీయాలను శాసించిన బొత్స కుటుంబం ఇప్పుడు నిట్టనిలువునా చీలినట్టయ్యింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు అటు మంత్రివర్గ విస్తరణ సులువుగా చేపట్టడంతో పాటు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను చెక్ చెప్పినట్టవుతుందని అధిష్టానం భావిస్తోంది.

Also Read:CM KCR- Governor Tamilisai: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?

Tags