AP Cabinet: సీఎం జగన్ కొరఢా ఝలిపించారు. ఏపీ మంత్రులకు క్లాస్ పీకారు. కొంత మంది మంత్రులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని.. తీరు మార్చుకోకపోతే క్యాబినేట్ లో మార్పులు తప్పవని హెచ్చరించారు. ఆరోపణలు వస్తున్నా చాలా మంది మంత్రులు ఎందుకు స్పందించడం లేదని జగన్ నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రభుత్వం అంటే అందరి బాధ్యత అని గుర్తు చేసినట్టు సమాచారం.

ఏపీ కేబినెట్ సమావేశం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. భావనపాడు పోర్టు విస్తరణతోపాటు పాణ్యంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అనుమతించారు. సచివాలయంలోని పలు శాఖల్లో 85 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నంద్యాల జిల్లాలోని పాణ్యంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అనుమతించారు.
-కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో సిబ్బంది నియామకానికి పచ్చజెండా ఊపారు.
-వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ.4700 కోట్లు జమ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈనెల 22 నుంచి వారం రోజుల పాటు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
-ప్రతి మండలంలో రెండు పీహెచ్.సీలకు కేబినెట్ ఆమోదం..
-రోడ్లు భవనాల శాఖలో ఆర్కిటెక్ట్ విభాగంలో ఎనిమిది పోస్టులు మంజూరు
-సైడిపాలెం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం కల్పన
-ఈనెల 5వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
-రూ. 1 లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి.. దీని ద్వారా ప్రత్యక్షంగా 40వేల మందికి.. పరోక్షంగా 60వేల మందికి ఉపాధి
-ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 175మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష
-నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ లు.. ఈ కోర్టుల్లో 40 మంది సిబ్బంది నియామకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.
-చిత్తూరు జిల్లా పేరూర్ లో కన్వెన్షన్ సెంటర్, రిసార్ట్స్ నిర్మాణానికి 32 ఎకరాలు భూమి ఒబెరాయ్ గ్రూప్ నకు..
-శ్రీకాకుళంలోని వెన్నెల వలసలో పశుసంవర్ధక శాఖ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు
-అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతూరు కేంద్రంగా రెవిన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
[…] […]