Nagarjuna- YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పార్టీ నేతలకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు ఇంటింటికీ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక వైసీపీ ముక్త ఏపీ కోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వివిధ కార్యాక్రమాలతో ప్రజాక్షేత్రంలో ఉడేందుకు యత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలో దిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.

అభ్యర్థుల వేటలో వైసీపీ…
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలో దించాలో ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేకుంటే కొత్తవారికి టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉంటూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎవరి టికెట్‌కు ఎసరు వస్తుందో అన్న భయం ఎమ్మెల్యేలు, మంత్రులను వెంటాడుతోంది.
ఎంపీ అభ్యర్థుల జాబితా రెడీ..
ఏపీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే పార్టీ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఇందులో పది మంది కొత్తవారిని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ జాబితాను ఇప్పుడే బయటపెట్టొద్దని జగన్ ఆదేశించారు. చివరి నిమిషంలో జాబితాలో పేర్లు మారే అవకాశం కూడా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు పేర్లు బహిర్గతమైతే.. టికెట దక్కని నేతల్లో నిరుత్సాహం నెలకొంటుందని, పార్టీ కార్యమ్రాల్లో పాల్గొనే అవకాశం ఉండదని అధిష్టానం భావించినట్లు పేర్కొంటున్నారు.
విజయవాడ నుంచి హీరో నాగార్జున..
ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడ లోక్‌షభ స్థానం నుంచి హీరో అక్కినేని నాగార్జునను బరిలో దించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈమేరకు తాడేపల్లిలో పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి 2014, 2019లో వైసీపీ అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్. పొట్లూరి వరప్రసాద్ లు పోటీ చేశారు. కానీ టీడీపీ చేతిలో ఓడిపోయారు. 2024 లో ఈ స్థానం ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ అధిష్టనం ఇప్పటి నుంచే అభ్యర్థి అన్వేషణ మొదలు పెట్టింది. ఈ మేరకు నాగార్జున పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో 2019లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయిన అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.

వైసీపీకి మోహన్‌బాబు దూరం..
ఇక 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతు తెలిపిన డైలాంగ్ కింగ్, హీరో మోహన్‌బాబు ఈసారి ఆ పార్టీకి దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును కలిశారు. తాజాగా మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ భూమా నాగిరెడ్డి రెండో కుమార్తెతో ఇటీవల కనిపించారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు మనోజ్ సమయం వచ్చినప్పుడు చెబుతా అని సమాధానం దాటవేశారు. ఈ క్రమంలో మంచు కుటుంబం వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్, భూమా కుటుంబాలకు పెరిగిన దూరం..
మరోవైపు వైఎస్.జగన్, భూమా నాగిరెడ్డి కుటుంబాల మధ్య దూరం కూడా పెరిగింది. భూమా శోభ బతికున్న మసయంలో వైసీపీలో ఉన్నారు. తర్వాత ఆమె కుమార్తె, మాజీ మంత్రి భూమ అఖిలప్రియారెడ్డి కూడా 2014లో వైసీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014 వైసీపీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆమె టీడీపీలో చేరి మంత్రిపదవి చేపట్టారు. మరోవైపు అఖిలప్రియకు వైఎస్సార్ బంధువు కుమారుడితో గతంలో వివాహమైంది. తర్వాత విడిపోయారు. ఇందుకు వైఎస్సార్ కుటుంభమే కారణమన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్, భూమా కుటుంబాల మధ్య దూరం పెరిగింది.