Purandeswari: హిందువులే టీటీడీ చైర్మన్ అవ్వాలి.. వైసీపీకి షాకిచ్చిన బిజెపి

తాజాగా ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. హిందూధర్మం అనుసరించే వారిని టీటీడీ చైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు.' ఇంతకుముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించింది.

Written By: Dharma, Updated On : August 8, 2023 5:02 pm

Purandeswari

Follow us on

Purandeswari: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మంటగలిపేలా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా అన్యమతస్తులు టిటిడి పై దాడులు చేస్తూనే ఉన్నారు. శ్రీవారి పవిత్రతను, తిరుమల కొండ ప్రాధాన్యాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ అన్య మతస్తులైన నాయకులు టీటీడీ చైర్మన్ కావడమే కారణమని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇటువంటి తరుణంలో భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించడం మరిన్ని వివాదాలకు కారణమవుతోంది.

రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006లో టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. అప్పట్లో చైర్మన్గా చేసిన వ్యవహారాలు వల్లే అనేక అనర్ధాలు చోటుచేసుకున్నాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మరోసారి అదే పని చేశారు. ఆయన క్రిస్టియన్ మాత్రమే కాదు.. కమ్యూనిస్టు కూడా. హిందూ దేవుళ్లను అవమానించేలా ఎన్నో ప్రకటనలు చేశారు. ఇప్పుడు అదే మనిషికి టిటిడి ని అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు పెదవి విప్పకపోవడం విశేషం.

తాజాగా ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. హిందూధర్మం అనుసరించే వారిని టీటీడీ చైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు.’ ఇంతకుముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించింది. దీనిపై విమర్శలు వచ్చిన తర్వాత 52 మంది నియామకాలను నిలిపివేసింది. టీటీడీని ప్రభుత్వం రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తోందని అర్థమవుతోంది. టీటీడీ దేవస్థానం చైర్మన్గా హిందూ ధర్మం అనుసరించే వాళ్ళనే నియమించాలి ‘… అంటూ పురందేశ్వరి ట్విట్ చేశారు.

అటు తెలంగాణలో బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఏపీ సీఎం జగన్కు హిందూ ధర్మంపై ఎందుకు అంత కోపం అని ప్రశ్నించారు. ఎన్నికల విడవిట్లో క్రిస్టియన్ గా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్ గా నియమించడం దారుణ చర్యగా అభివర్ణించారు. ఎప్పటికైనా ఏపీలోని హిందువులు మేల్కొనాలని పిలుపునిచ్చారు. మొత్తానికైతే టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం వివాదాస్పదమవుతోంది. కానీ జగన్ సర్కార్ ఎటువంటి ప్రకటన చేయడం లేదు. ఇది విమర్శలకు కారణమవుతోంది.