Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డికి బోల్డ్ ఇమేజ్ ఉంది. ఈ అమ్మడు చర్యలు ఊహాతీతం. ఇంస్టాగ్రామ్ వేదికగా స్కిన్ షో చేస్తుంది. ఒక్కోసారి అది హద్దులు దాటేస్తుంది. ఈ క్రమంలో నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ చేస్తుంటారు. అయితే అషురెడ్డి పట్టించుకోదు. పైగా కౌంటర్స్ వేస్తుంది. తప్పు నా బట్టల్లో లేదు మీ కళ్ళలోనే కామం ఉందంటుంది. ఇంస్టాగ్రామ్ ఆదాయమార్గంగా మారిన తరుణంలో అషురెడ్డి ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఇలా అందాల ప్రదర్శనకు దిగుతుంది. తాజాగా బాడీ కాన్ డ్రెస్ లో జిమ్ లో అగుపించింది.
అలాంటి బట్టల్లో జిమ్ లో ఏం చేస్తున్నావని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అషురెడ్డి మొదట్లో డబ్స్మాష్ వీడియోలు చేసేది. టిక్ టాక్ ఆఫ్ ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. జూనియర్ సమంతగా పాప్యులర్ అయిన అషురెడ్డి… బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ దక్కించుకుంది. ఆ దెబ్బతో మరింత పాపులర్ అయ్యింది. అప్పటి వరకూ సోషల్ మీడియా జనాలకు మాత్రమే తెలిసిన అషురెడ్డి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
హౌస్లో అషురెడ్డి అందాల ప్రదర్శనకు తెరలేపింది. అయితే గేమ్ లేకుండా రాణించడం అంత సులభం కాదు. అందుకే అషురెడ్డిని ప్రేక్షకులు త్వరగానే రిజెక్ట్ చేశారు. అయితే ఎంతో కొంత గుర్తింపు అయితే దక్కింది. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ ఓటీటీలో కూడా అషురెడ్డి పాల్గొంది. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఆమె నటిగా ప్రయత్నాలు చేస్తుంది. ఫేమ్ కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి.
ఆ విషయంలో కొందరు అషురెడ్డిని విపరీతంగా తిట్టారు. ఇటీవల అషురెడ్డి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం. టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ నేరుగా పట్టుబడ్డాడు. అతడి కాల్ డేటాలో అషురెడ్డి ఫోన్ నంబర్ ఉందట. వందలసార్లు అషురెడ్డితో కేపీ చౌదరి మాట్లాడినట్లు ఆధారాలు దొరికాయి. దీంతో అషురెడ్డిని ప్రశ్నిస్తారనే ప్రచారం జరిగింది. తనపై ప్రసారం అవుతున్న వార్తలను అషురెడ్డి ఖండించారు. ఎక్కువగా విదేశాల్లో ఉంటున్న అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటున్నారు.