జగన్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది ! ఇంకో మాట లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా ప్రబలిన మొదట్లో పారాసెట్మాల్ ట్యాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్ దీనిని నివారిస్తాయని.. అసలు ఇబ్బందే అవసరం లేదని చెప్పినప్పుడు అందరూ అతనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే వైసిపి వారు అందుకు కొన్ని శాస్త్రీయపరమైన రుజువులు పెట్టి తామేదో గొప్ప పని చేశాము అని విర్రవీగారు. అసలు విషయం వేరే… బ్లీచింగ్ పౌడర్ వేరే అని సబ్జెక్టు తెలిసిన వారికి అర్థమైంది. Also Read : పేకాట శిబిరం […]

Written By: Navya, Updated On : August 29, 2020 12:31 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా ప్రబలిన మొదట్లో పారాసెట్మాల్ ట్యాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్ దీనిని నివారిస్తాయని.. అసలు ఇబ్బందే అవసరం లేదని చెప్పినప్పుడు అందరూ అతనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే వైసిపి వారు అందుకు కొన్ని శాస్త్రీయపరమైన రుజువులు పెట్టి తామేదో గొప్ప పని చేశాము అని విర్రవీగారు. అసలు విషయం వేరే… బ్లీచింగ్ పౌడర్ వేరే అని సబ్జెక్టు తెలిసిన వారికి అర్థమైంది.

Also Read : పేకాట శిబిరం వెనుక మంత్రి?

ఇక ఈ వాదన అంతా పక్కన పెడితే…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోందని మొదటి నుండి మనం వింటూనే ఉన్నాం. కొన్ని నెలలు ఎన్ని కేసులు నమోదయ్యాయి అని గమనిస్తూ ఉన్నాం, చర్చలు పెట్టుకున్నాం, డిబేట్లు జరుపుకున్నాం…. చివరికి రోజూ ఉండేదే కదా అని మనకి మనం సర్దిచెప్పుకొని అలా ముందుకు సాగిపోతూ ఉన్నాం. తీరా చూస్తే ఒక్కసారిగా దేశంలో నెంబర్ 2 స్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎగబాకింది. అదికూడా ఏ అభివృద్ధిలోనో…. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనో కాదు.

ఒక్క మెట్రో సిటీ కూడా లేని ఆంధ్ర ప్రదేశ్ అత్యధిక కరోనా పాజిటివ్ కేసులో రెండ్వ స్థానాన్ని సాధించిందంటే చిన్న ఘనత కాదు. అందుకు వైసిపి ప్రభుత్వమే కారణం. అందరూ అనుకున్నట్టే మొదటి రాష్ట్రంలో మహారాష్ట్ర ఉంది. ఇప్పటివరకు తమిళనాడు రెండవ స్థానంలో ఉండేది. అయితే ప్రతిరోజూ వరుసగా 10,000కి పైగా కేసులను నమోదు చేసుకుంటూ…. ఏపీ ప్రభుత్వం తమిళనాడుని వెనక్కి నెట్టేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కోవిడ్ హాట్ స్పాట్ లు గా ఉన్నాయి. కానీ వారు ఎంతో నిబద్ధతతో వైరస్ ను కంట్రోల్ చేయగలిగారు కానీ ఏపీలో మాత్రం కట్టు తప్పింది.

అదేమన్నా అంటే… రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కసారైనా కరోనా సోకుతుందని వైసీపీ లీడర్లు పుసుక్కున అనేసారు. అసలు కరోనా వ్యాప్తి నివారణే ప్రథమ లక్ష్యం. దానిని ప్రజలమధ్య సోకనివ్వకుండా నివారించగలిగితే మరణాలు తగ్గుతాయి. మరణాల రేటు తగ్గుతుంది. అంతేగాని ఇన్ఫెక్ట్ అయిన వారు వేలల్లో ఉంటూ డాక్టర్లు వందల సంఖ్యలో ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వం చేస్తున్న ఈ పనులకు, తీసుకుంటున్న నిర్ణయాలు మధ్య ప్రజలు నలిగిపోతున్నారు.

Also Read : పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?

ఇలాంటి క్లిష్ట సమయంలో…. అదీ దేశంలోనే అత్యధిక కేసుల లిస్టులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్న సమయం….లో అమరావతి గొడవ, రాజధాని గొడవ, విశాఖ గొడవ, గెస్ట్ హౌస్ లో గొడవ, కౌలు గొడవ, భూముల గొడవ.. ఇంకా మరెన్నో….! ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యమా? మన పంతాల ముఖ్యమా? రోజుకి వంద మంది మరణిస్తున్నారు. దీనిపై ఆమనం ప్రత్యేకంగా లోచిస్తున్నది ఏమీ లేదు. ఏపీలో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరగడం పై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అసలక్కడ ఏం జరుగుతోంది అంటూ ఏపీ సర్కార్ కు లేఖ రాసింది. కానీ వీరు మాత్రం తిరుగు లేఖలో మాకు రాజధాని కావాలి…. అది కావాలి…. ఇది కావాలి…. మీ అపాయింట్మెంట్ కావాలి…. వచ్చి మీరు శంకుస్థాపన చేయాలి అని రాస్తున్నారు. అసలు కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు ఏమి తీసుకుంటున్నారో చెప్పడంలేదు. కరోనా అన్నది అందరికీ వస్తుంది…. పోతుంది అన్న తమ పాలసీని నమ్ముకున్నట్లుంది ఏపీ ప్రభుత్వం. దీనికన్నా అవాంఛనీయం, అమానుషం ఇంకేముంటుంది?

Also Read : అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్