Homeఎంటర్టైన్మెంట్సందిగ్ధంలో దర్శకుడు.. 'సాయి పల్లవి'నా.. 'కీర్తి సురేష్'నా.. ?

సందిగ్ధంలో దర్శకుడు.. ‘సాయి పల్లవి’నా.. ‘కీర్తి సురేష్’నా.. ?


చాలా సంవత్సరాలు నుండి మన హీరోలలో కొంతమంది హీరోలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే హీరోయిన్స్ దొరకడం లేదు. వాళ్ళల్లో బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు, గోపీచంద్‌, మంచు విష్ణు లాంటి జూనియర్ హీరోలు ఉన్నారు. మొత్తానికి హీరోయిన్ సమస్య అనేది తెలుగు ఇండస్ట్రీలో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఏ బాలయ్య లాంటి సీనియర్ కి హీరోయిన్ సమస్య అంటే సహజమే కదా అనుకోవచ్చు.. కానీ, గోపిచంద్ లాంటి హీరోకి కూడా అదే సమస్య అంటే కాస్త ఆలోచించతగ్గ అంశమే. నిజానికి ప్రెజెంట్ ఉన్న చాలామంది హీరోయిన్స్ లో సగంమంది గోపిచంద్ హైట్ కి, ఇమేజ్ కి సెట్ అవ్వరు. అనుష్క, పూజా హెగ్డే లాంటి వారు సెట్ అయినా, వాళ్ళను పెట్టుకునే మార్కెట్ అండ్ బడ్జెట్ గోపిచంద్ సినిమాకి ప్రస్తుతం లేకపాయే.

Also Read: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌

అందుకే గోపిచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’లో హీరోయిన్ కోసం ఎప్పటినుండో వెతుకుతున్నా ఇంకా ఎవరు ఓకే కాలేదు. రాశి ఖన్నా చేస్తానని ముందుకు వచ్చినా, అలిమేలు మంగ పాత్ర మీదే సినిమా నడుస్తోంది. మరి అలాంటి కీలక పాత్రలో సరిగ్గా ఎక్స్ ప్రెషన్స్ ను కూడా పలికించలేని రాశిని పెట్టుకుంటే, సినిమాకి లాస్ అనేది దర్శకుడు తేజ ఆలోచన. అందుకే తేజ మొదటినుండి ఈ పాత్రకు కాజల్ అగర్వాల్ నే అనుకుంటూ వచ్చాడు. తానూ అడిగితే కాజల్ కాదనదు, కాజల్ కూడా తేజ కోసం ఈ సినిమా చేస్తానని చెప్పింది కూడా. కాకపోతే మరో ఏడాది దాకా డేట్స్ లేవని అంది.

ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా అలాగే విజయ్ మాస్టర్ 2 కూడా ఉంది. ఈ సినిమాలన్ని పూర్తి అయ్యాక గాని, కాజల్ మరో సినిమా చేయలేదు. ఆ రకంగా గోపిచంద్ సినిమాకి కాజల్ దూరం అయిపోయింది. తాను రాసుకున్న అలిమేలు మంగ పాత్రకు న్యాయం చేయాలంటే కచ్చితంగా టాలెంటెడ్ హీరోయినే అయి ఉండాలి. ఈ క్రమంలోనే తేజ,.మొదట హీరోయిన్ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని ఆమెను అప్రోచ్ అయితే, కీర్తి నో చెప్పింది.

Also Read: ‘ఎన్టీఆర్’కి రాజకీయాలే వ్యాపారం అట !

ఇప్పటికే వరుస సినిమాలు ఒప్పుకున్నానని వివరణ ఇచ్చే సరికి, తేజ, సాయి పల్లవిను ఫైనల్ చేయటానికి ఆమెకు కథ కూడా చెప్పాడు. ఇక ఆల్ మోస్ట్ సాయి పల్లవి ఫిక్స్ అనుకునేలోపు, మళ్లీ కీర్తి సురేష్ ఈ సినిమా చేస్తానని టచ్ లోకి వచ్చిందట. ఇప్పుడు వీరిద్దరిలో ఎవర్ని తీసుకోవాలో అని తేజ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version