Anukathir Surya: ఇకపై ఆమె కాదు.. ఆయన.. మాగాడిగా మారిన ఓ లేడీ సివిల్ సర్వీస్ అధికారిణి కథ

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు చెందిన సీనియర్ అధికారి అధికారిక రికార్డుల్లో పేరు, లింగాన్ని మార్చుకున్నారు. చరిత్రలోనే తొలిసారిగా వచ్చిన ఈ అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్‌లో కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం జాయింట్ కమిషనర్‌ (ఆథరైజ్డ్ రిప్రంజటేటివ్)గా పనిచేస్తున్న 35 ఏళ్ల అనసూయ చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

Written By: Neelambaram, Updated On : July 10, 2024 11:56 am

Anukathir Surya

Follow us on

Anukathir Surya: ఇండియన్ సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టానికి కేంద్ర ప్రభుత్వం తెర లేపింది. ఒక ఐఆర్ఎస్ అధికారి లింగ మార్పిడి (సెక్సువల్ గా కాకుండా) కి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇక ఆ అధికారి పేరు రికార్డుల్లో స్త్రీ లింగం కాకుండా పురుషుడిగా పరిగణిస్తారు.

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు చెందిన సీనియర్ అధికారి అధికారిక రికార్డుల్లో పేరు, లింగాన్ని మార్చుకున్నారు. చరిత్రలోనే తొలిసారిగా వచ్చిన ఈ అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్‌లో కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం జాయింట్ కమిషనర్‌ (ఆథరైజ్డ్ రిప్రంజటేటివ్)గా పనిచేస్తున్న 35 ఏళ్ల అనసూయ చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ‘అనసూయ’.. ‘అనుకతిర్ సూర్య’గా మారిపోయారు. ఇన్నాళ్లు మహిళగా ఉన్న అనుకతిర్‌ను ఇకపై పురుషుడిగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఆమెకు సంబంధించి అన్ని అధికారిక రికార్డుల్లో అనుకతిర్ సూర్యగా పేరు మారుస్తున్నారు.

లింక్డ్ ఇన్‌ ప్రొఫైల్ ప్రకారం.. సివిల్స్‌కు ఎంపికైన అనసూయ అలియాస్ అనుకతిర్ సూర్య డిసెంబర్, 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగంలో చేరింది. 2018లో డిప్యూటీ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందిన సూర్య.. గత సంవత్సరం నుంచి హైదరాబాద్‌‌లో జాయింట్ కమిషనర్ (జేసీ) హోదాలో విధులు నిర్వర్తిస్తుంది. ఇక ఆమె చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీటెక్ కంప్లీ్ట్ చేసింది. ఉద్యోగంలో చేరిన తర్వాత భోపాల్‌లో నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా అందుకుంది.

జులై 9వ తేదీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో ‘ఎం అనుసూయ ఐఆర్ఎస్ (సీ అండ్ ఐటీ 2013.. ఎంప్లాయ్ కోడ్ 4623, డీఓబీ (పుట్టిన తేదీ 20.10.1988) కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్-హైదరాబాద్.. అభ్యర్థన మేరకు ఆమె పేరు, లింగాన్ని అధికారిక రికార్డుల్లో ‘ఎం అనుకతిర్ సూర్య’గా మార్చుకునేందుకు అమోదించాం’ అని పేర్కొన్నారు. ఇకపై ఆమెను స్త్రీగా కాకుండా పురుషుడిగా పరిగణిస్తామని. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకియ పూర్తయ్యిందని తెలిపింది.

‘ఇది చరిత్రాత్మక పరిణామం.. ఇండియన్ సివిల్ సర్వీసెస్ లింగ గుర్తింపునకు పురోగతిని హైలైట్ చేస్తుంది.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ప్రభుత్వ విభాగాల్లో లింగమార్పిడి వ్యక్తులను చేర్చుకోవడం, మద్దతుకు ఉదాహరణగా నిలుస్తుంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఓ సీనియర్ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు.