మరో ఎమ్మెల్యేకు కరోనా..!

రాష్ట్రంలో వరుసగా ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకడం ఆ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన అమెరికా వెళ్లడంతో వైరస్ భారిన పడినట్లు తేలింది. తాజాగా రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా భారిన పడ్డారు. కర్నూలుకు చెందిన ఈ ఎమ్మెల్యేకి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..! ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాలకు ఈ ఎమ్మెల్యే […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 12:14 pm
Follow us on


రాష్ట్రంలో వరుసగా ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకడం ఆ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన అమెరికా వెళ్లడంతో వైరస్ భారిన పడినట్లు తేలింది. తాజాగా రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా భారిన పడ్డారు. కర్నూలుకు చెందిన ఈ ఎమ్మెల్యేకి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!

ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాలకు ఈ ఎమ్మెల్యే హాజరయ్యారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి తిరిగారు. అంతే కాదు ఆయన ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కలిసి తన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పథకాలు, సమస్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎంఓ అధికారుల్లో ఆందోళన నెలకొంది.

అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికలు పూర్తియిన అనంతరం ఆయన కర్నూలు జిల్లాలోని తన నియోజకవర్గానికి చేరుకుని వివిధ గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం జ్వరం, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పరీక్షలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గురువారం ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో ఆయన అనుచరులు, నియోజకవర్గంలో వివిధ కార్యక్రమంలో పాల్గొన్న వారిలోను ఆందోళన నెలకొంది.

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మనవడికి వైరస్ సోకగా, విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి మేనల్లుడికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 533 మందికి కరోనా సోకింది. వీరిలో రాష్ట్రంలోని వారు 477 మంది ఉండగా మిగిలిన వారు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10,884 మంది వైరస్ భారిన పడ్డారు.