https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ ప్రకటించక తప్పే పరిస్థితి కనిపించడం లేదు. వైరస్ భారిన పడితున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో 920 కేసులు నమోదు అవగా, మొత్తం కేసులు 11 వేలకు చేరగా, ఏపీలో 533 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 10,884 చేరాయి. ఇతర రాష్ట్రలతో పోలిస్తే కేసుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా వైరస్ వ్యాప్తిని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 26, 2020 / 11:02 AM IST
    Follow us on


    తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ ప్రకటించక తప్పే పరిస్థితి కనిపించడం లేదు. వైరస్ భారిన పడితున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో 920 కేసులు నమోదు అవగా, మొత్తం కేసులు 11 వేలకు చేరగా, ఏపీలో 533 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 10,884 చేరాయి. ఇతర రాష్ట్రలతో పోలిస్తే కేసుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా వైరస్ వ్యాప్తిని నిలువరుంచకపోతే తెలుగు రాష్ట్రాలు అదే స్థాయికి చేరుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

    లాక్ డౌన్ విషయంలో కేంద్రం రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చేసింది. స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులో 15 వేలకు చేరడంతో జూలై 31 వరకూ లాక్ డౌన్ విధిస్తూ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో లాక్ డౌన్ కు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

    దీంతో తెలుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, తెలంగాణాలలో కూడా మరోసారి లాక్ డౌన్ విధించడంతో వైరస్ వ్యాప్తిని నివారిస్తే పరిస్థితి కొంత వరకూ అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కోలుకున్న వారి సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్యకు వ్యత్యాసం రోజు రోజుకూ పెరుగుతుంది. యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవడం ఆందోళన కలిగిస్తోంది.

    లాక్ డౌన్ సడలింపుల వల్ల రాకపోకలు పెరిగిపోవడం, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణ ప్రాంతాలకు వచ్చి వెళుతుండటంతో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి పెరిగింది. ఏపీలో కర్నూలు వైరస్ కేసుల సంఖ్య 1,500 దాటింది. కృష్ణా, అనంతపురం జిల్లాలో కేసులు వెయ్యి దాటిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ ఆవశ్యకత కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.