https://oktelugu.com/

మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!

కొన్నాళ్లుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చర్యలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారగా, దీనికి అడ్డుకట్ట వేయాలని రెండు రోజులక్రితం ఆయనకు షో కాజ్ నోటీసులు జారీచేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న తన వ్యాఖ్యల వెనుక కారణం తెలియజేయాలని కోరారు. దీనిపై రఘురామ కృష్ణం రాజు విభిన్నంగా స్పందించారు. నేను ఎప్పుడూ పార్టీకి కానీ..పార్టీ అధినేత జగన్ కి కానీ వ్యతిరేకంగా మాట్లాడింది లేదు అన్నారు. జగన్ అధ్బుత పథకాలతో ప్రజాకర్షణ పాలన చేస్తున్నప్పటికీ..క్షేత్రస్థాయిలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 26, 2020 / 09:50 AM IST
    Follow us on


    కొన్నాళ్లుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చర్యలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారగా, దీనికి అడ్డుకట్ట వేయాలని రెండు రోజులక్రితం ఆయనకు షో కాజ్ నోటీసులు జారీచేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న తన వ్యాఖ్యల వెనుక కారణం తెలియజేయాలని కోరారు. దీనిపై రఘురామ కృష్ణం రాజు విభిన్నంగా స్పందించారు. నేను ఎప్పుడూ పార్టీకి కానీ..పార్టీ అధినేత జగన్ కి కానీ వ్యతిరేకంగా మాట్లాడింది లేదు అన్నారు. జగన్ అధ్బుత పథకాలతో ప్రజాకర్షణ పాలన చేస్తున్నప్పటికీ..క్షేత్రస్థాయిలో వాటి అమలులో జరుగుతున్న లోపాల గురించిన మీడియా ముఖంగా తెలియజేశాను. అంత మాత్రాన నేడు పార్టీ వ్యతిరేకిని ఎలా అవుతాను అన్నారు. ఈ మాటలను బట్టి ఆయన సంధి మార్గం ఎంచుకుంటున్నారని అనిపించినా..మరలా అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.

    ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

    మీరు పార్టీ నుండి సస్పెండ్ కావాలని…ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది..మీ అభిప్రాయం ఏమిటనగా? పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేస్తే నేను చాలా భాధపడతాను. జగన్ ని బాగా అభిమానించే వ్యక్తులలో నేను ఒకరిని..నేను ఎందుకు సస్పెండ్ కావాలని కోరుకుంటాని అని ఆయన అన్నారు. ఐతే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు మీదుగా కృష్ణం రాజుకు షో కాజ్ నోటీసులు రావడాన్ని ఆయన తప్పుబట్టినట్లు తెలుస్తుంది. ఇలాంటి విషయాలపై స్పందిచాల్సింది క్రమ శిక్షణా సంఘం కదా…వైస్సార్సీపీ పార్టీకి క్రమశిక్షణా సంఘం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారట.

    ఈ పరిణామాలతో వైసీపీ పార్టీతో ఆయన సంధి కోరుకుంటున్నారా లేక సమరానికి సిద్ధం అవుతున్నారా అనేది స్పష్టం కావడం లేదు. మొదటి నుండి పరిణామాలను గమనిస్తే ఆయన వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారని అర్థం అవుతుంది. వైసీపీ పార్టీలో తనకు ప్రాధాన్యం లేదు, కనీసం జగన్ అప్పాయింట్మెంట్ కూడా దొరకని స్థితిలో ఈ ఎంపీ ఉన్నారు. దీనికి తోడు ఈయనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం ఒక ప్రధాన కారణం. తన విపరీత చర్యల వలన వైసీపీ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయగలదు కానీ, ఎంపీ పదవిని పోగొట్టలేదు. కావున ఆయన వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ అయినా…బీజేపీ పార్టీలో చేరి అన్ని విధాలుగా ప్రయోజనాలు అనుభవించవచ్చు, అనేది ఆయన లోలోపల ఉన్న ఆలోచన కావచ్చు. మరి కొన్ని రోజులలో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కలదు.