Tollywood: జగన్ చేతికి మరో అస్త్రం.. టాలీవుడ్ కు మరిన్ని ఇబ్బందులు?

Trouble for Tollywood: ఏపీలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన జగన్ సర్కార్ సినీ ఇండస్ట్రీపై మాత్రం గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. కరోనాతో కుదేలైన టాలీవుడ్ ఇండస్ట్రీని మరింత కుదేలయ్యేలా ఏపీ సర్కారు తాజాగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే భారీ టికెట్లను తగ్గింపు, బెనిఫిట్ షోలను రద్దు చేసిన ప్రభుత్వం కొద్దిరోజులుగా థియేటర్లను పెద్దసంఖ్యలో మూసివేస్తూ ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలను అణిచివేసినట్లుగానే టాలీవుడ్ పైనే ఆ మాదిరిగానే వ్యవరిస్తోంది. థియేటర్ల మూసివేతను చూస్తుంటే జగన్ […]

Written By: NARESH, Updated On : December 25, 2021 5:32 pm
Follow us on

Trouble for Tollywood: ఏపీలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన జగన్ సర్కార్ సినీ ఇండస్ట్రీపై మాత్రం గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. కరోనాతో కుదేలైన టాలీవుడ్ ఇండస్ట్రీని మరింత కుదేలయ్యేలా ఏపీ సర్కారు తాజాగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే భారీ టికెట్లను తగ్గింపు, బెనిఫిట్ షోలను రద్దు చేసిన ప్రభుత్వం కొద్దిరోజులుగా థియేటర్లను పెద్దసంఖ్యలో మూసివేస్తూ ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ప్రతిపక్ష పార్టీలను అణిచివేసినట్లుగానే టాలీవుడ్ పైనే ఆ మాదిరిగానే వ్యవరిస్తోంది. థియేటర్ల మూసివేతను చూస్తుంటే జగన్ సర్కార్ టాలీవుడ్ పై కక్ష్య సాధింపు చేస్తుందా? అన్న అనుమానాలు రాకమానదు. కరోనాతో దెబ్బతిన్న ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోకపోగా మరింత కుదేలయ్యేలా నిర్ణయాలు తీసుకుంటుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.

CM Jagan Vs Tollywood

ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ స్వాగతించింది. అయితే టికెట్లను తగ్గింపుపై కొంతమంది నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గతంలో మాదిరిగానే తొలి వారం టికెట్ల పెంచుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే దీనికి ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.

అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టర్లు టికెట్ల పెంపునకు అనుమతి అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టికెట్ల రేట్లను థియేటర్లు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పలు థియేటర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని సాకుతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఈ పరిణామం రాబోయే పెద్ద సినిమాలపై ప్రభావం చూపే అవకాశం కన్పిస్తోంది.

మరోవైపు టికెట్ల పెంపునకు కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కారు హైకోర్టుకు అప్పీల్ చేసింది. ఇక్కడ తీర్పు వ్యతిరేకం వస్తే డివిజన్ బెంచ్ కు వెళ్లేలా ప్రణాళికలను రచిస్తోంది. ఎలాగైనా ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. టికెట్ల ధరలపై హైకోర్టు తుది తీర్పు జనవరి తొలి వారానికి వాయిదా వేసింది. ఈలోపే ప్రభుత్వం థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటూ భయబ్రాంతులకు గురిచేస్తోందనే వాదనలు విన్పిస్తున్నాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఉక్కుపాదం తప్పదనే హెచ్చరికలను థియేటర్ల యజమానులకు సీఎం జగన్ పంపిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వానికి కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఒమ్రికాన్ ఆంక్షలను జగన్ సర్కారు తెరపైకి తీసుకొచ్చే అవకాశం కన్పిస్తోంది. కేంద్రం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న ఒమ్రికాన్ కేసుల కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేసింది.

ప్రభుత్వం ఒకవేళ దీనిని అవకాశంగా తీసుకుంటే మాత్రం టాలీవుడ్ కు మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఏపీలో నైట్ కర్ఫ్యూ పెట్టి సెకండ్ షోలు రద్దు చేయించడం.. యాభైశాతం ఆక్యుపెన్సీ పెట్టడం లాంటి చర్యలకు జగన్ సర్కారు దిగితే ఆ ప్రభావం పెద్ద సినిమాలపై భారీగా పడే అవకాశం ఉందనుంది. మొత్తంగా టాలీవుడ్ ను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం దగ్గర చాలా అస్త్రాలే ఉన్నాయనేది స్పష్టం అవుతోంది. ఈనేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు జగన్ సర్కారుతో ఎలా వ్యవహరిస్తారనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.