Microsoft Artificial Intelligence: ప్రస్తుత సాంకేతిక కాలంలో ఆర్టిఫిషియల్ చేస్తున్న ఇంటెలిజెన్స్ చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. సాంకేతిక ప్రపంచాన్ని ఒక కుదుపు కుదుపుతోంది. అసలే ఆర్థిక మాంద్యం ఉందంటే దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడు కావడంతో చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఒక సంస్థ చేపట్టిన సర్వేలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సుమారు లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారని తేలింది. ఇక టెక్ కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కీలక ప్రకటన చేసింది. ఏ ఐ ని సమర్థవంతంగా వినియోగించేందుకు, ఉపాధి పొందేలా ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోర్సులను నేర్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కోర్సులను లింక్డ్ ఇన్ తో కలిసి అభివృద్ధి చేసినట్టు చెబుతోంది.
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ కంటెంట్ పేరుతో ఉచితంగా నేర్పించే ఈ కోర్సును ఔత్సాహికులు నేర్చుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కోర్స్ నేర్చుకున్న అనంతరం కెరియర్ ఎసెన్షియల్ సర్టిఫికెట్ సైతం పొందవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ గా మారి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందవచ్చని ప్రకటించింది.. ప్రస్తుతం సాంకేతిక ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సాగుతుండడంతో దీన్ని నేర్చుకున్న వారు కచ్చితంగా గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్తారని మైక్రోసాఫ్ట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వేతన స్థాయి కూడా గరిష్టంగా ఉంటుందని అంచనా వేస్తుంది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం లక్ష మంది దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్ అవసరమవుతారని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.
ఇటీవల భారత ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కాం విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువత ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని, ఉద్యోగాలు చేసే సత్తా విషయంలో రెండవ స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. ఏఐ స్కిల్స్, నైపుణ్యాన్ని విస్తరించే విషయంలో మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం టాలెంట్ ఉన్న నాలుగు లక్షల ఇరవై వేల మంది నిపుణులను పరిగణలోకి తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ ఎం ఎల్ బిగ్ డేటా అనలిటిక్స్ టెక్ టాలెంట్ డిమాండ్, సప్లై మధ్య అంతరాయం 51 శాతం గా ఉంది. ” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరి కొత్త పని విధానాన్ని రూపొందించేందుకు సిద్ధంగా ఉంది. నైపుణ్యపరంగా వృద్ధి సాధించేలాగా మేము అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఉపయోగపడుతుంది. గత రెండు సంవత్సరాలలో టైర్ _2, టైర్_3 పట్టణాల నుంచి విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలలో శిక్షణ పొందారు” అని మైక్రోసాఫ్ట్ నిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో.