తెలంగాణ ప్రభుత్వం పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించింది. అడవుల శాతం పెంచి ప్రకృతి శోభను పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతోంది. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో మొక్కల పెంపకంపై శ్రద్ధ కనబరుస్తోంది. హరితహారంపై చర్చలో భాగంగా శుక్రవారం శాసనసభలో సీఎం కేసీఆర్ హరితహారంపై మాట్లాడారు. ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే హరిత ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి నిలిపినట్లు తెలిపారు. విపక్షాలు సైతం సహకరించాలని కోరారు.
ప్రజాప్రతినిధులు ప్రతి నెల రూ.500 హరితనిధికి ఇచ్చేందుకు సమ్మతం తెలిపారు. దీనికి మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు సైతం ముందుకు రావాలని సూచించారు. హరిత నిధి విషయంలో ప్రతిపాదనలు కడా చేశారు. దీంతో రాష్ర్టంలో పచ్చదనం వికసించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ర్టం సుభిక్షంగా ఉండాలంటే చెట్లు ఆవశ్యకమని తెలుస్తోంది. అడవుల రక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వ చర్యను అందరు హర్షిస్తున్నారు.
హరిత నిధి కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు. ప్రవేశాల సమయంలో హరిత నిధికి జమ చేయాలని సూచిస్తున్నారు. ప్రవేశాల సమయంల పాఠశాల విద్యార్థులు రూ.5, ఉన్నత పాఠశాల విద్యార్థులు రూ.15, ఇంటర్ విద్యార్థులైతే రూ.25, డిగ్రీ విద్యార్థులైతే రూ. 50, వృత్తి విద్యా కోర్సు విద్యార్థులు రూ.100 జమ చేయాల్సి ఉంటుంది.
లైసెన్స్ రెన్యువల్ సమయంల వ్యాపారులు బార్లు, మద్యం దుకాణదారులు హరిత నిధికి రూ.1000 జమ చేయాల్సి ఉంటుంది. రిజిస్టేషన్ల సమయంలో రూ.50 చెల్లించాలి. ఇవన్నీ ప్రభుత్వానికి చేరడంతో వాటితో ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి రాష్ర్టంలో పచ్చదనం నిండేలా చర్యలు తీసుకుంటోంది. దీనికి సీఎం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.
