ఎట్టకేలకు మెగాస్టార్ రెడీ.. 20 నుండి మొదలు !

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలు పెడుతున్నారు. గత వారం మెగాస్టార్ కి పొరపాటున కోవిడ్-19 పాజిటివ్ అని రావడం, ఆ తరువాత మళ్లీ నెగిటివ్ అని రావడంతో మొత్తానికి మెగాస్టార్ కూడా ఆచార్య షూటింగ్ కి రెడీ అయ్యారు. నవంబర్ 20 నుండి చిరు షూట్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కాగా చిరు షూటింగ్ కు ఇక విరామం లేకుండా షూట్ […]

Written By: Neelambaram, Updated On : November 16, 2020 5:49 pm
Follow us on

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలు పెడుతున్నారు. గత వారం మెగాస్టార్ కి పొరపాటున కోవిడ్-19 పాజిటివ్ అని రావడం, ఆ తరువాత మళ్లీ నెగిటివ్ అని రావడంతో మొత్తానికి మెగాస్టార్ కూడా ఆచార్య షూటింగ్ కి రెడీ అయ్యారు. నవంబర్ 20 నుండి చిరు షూట్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కాగా చిరు షూటింగ్ కు ఇక విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాలకు సూచించారట. కాగా ముందుగా యాక్షన్ లేని సీన్స్ ను ప్లాన్ చేసుకోమని చిరు కొరటాలకు చెప్పారట.

Also Read: కమల్ హాసన్ ఓ గుడ్డివాడిగా.. !

దాంతో కొరటాల 20 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ను ప్లాన్ చేశాడు. ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. నిజానికి కొరటాల కథలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. అలాగే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చిరు చూస్తారు కాబట్టి.. అదిరిపోయే స్టెప్స్ కూడా ఈ సినిమాలో ఉండటం ఖాయం. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: రియల్ హీరో సోనుసూద్ సాయం వెనుక ఉందెవరు?

మెగాస్టార్, కొరటాల బలబలాలను బట్టి వీరి సినిమాలో ఉండబోయే అంశాలు పరిశీలిస్తే సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే కొరటాల సినిమాలో కూడా ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ పెట్టారు. అది శ్రీధర్ సిపాన చేత రాయిస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఈ నెల 20 నుండి స్టార్ట్ చేసే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు జరగనుంది. ఆ తరువాత చిరు పై సోలో సాంగ్స్ షూట్ చేస్తారట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.