AP Employees PF Money: ఏపీలో 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కలవరపాటుకు గురయ్యారు. వారి జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల నగదు మాయం కావడంతో ఆందోళనకు గురయ్యారు. సైబర్ నేరం జరిగి ఉంటుందని తొలుత అనుమానించారు. తీరా ప్రభుత్వమే నగదును విత్ డ్రా చేసిందని తెలియడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించక.. అన్నివిధాలా దగా చేసిన ప్రభుత్వం జీపీఎఫ్ ఖాతాలను ఖాళీ చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శిస్తున్నారు. కేసులు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇంటి అవసరాల కోసం వేలాది మంది జీపీఎస్ అడ్వాన్స్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత అవసరాలకు విడుదల కాని నిధులను, ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటున్నది ఉద్యోగుల ప్రశ్న.
గత రెండుసార్లు..
వాస్తవానికి డీఏ బకాయిలు ఉండిపోవడంతో ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం రెండు సార్లు.డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. కానీ వారికి తెలియకుండానే రెండు సార్లు ఖాతాల నుంచి మళ్లించింది. తాజాగా రెండు రోజుల కిందట నుంచి ఉద్యోగులకు మెసేజ్ లు వస్తున్నాయి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు క్రెడిట్ అయినట్టు చూపిస్తోంది. అదే సమయంలో అకౌంటెంట్ జనరల్ గత ఏడాది జీపీఎఫ్ వార్షిక వివరాలు వెల్లడించింది. దానిని చూసుకున్న ఉద్యోగులు రెండు సార్లు నగదు క్రెడిట్ అయినట్టు గుర్తించారు. గతంలో ఒకసారి మళ్లించి తిరిగి చెల్లించినట్టు కూడా వెల్లడైంది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాము దాచుకున్న నగదుకు ప్రభుత్వం బ్యాంకర్ గా వ్యవహరించాలే తప్ప.. తమకు తెలియకుండా నగదు ఎలా మళ్లీస్తుందని ప్రశ్నించారు. దీనిపై అనుమానాలు పెరుగుతున్నాయని.. దీనిని నివ్రుత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందంటున్నారు.
Also Read: YCP Politics: వైసీపీలో ‘కుట్ర’ కోణాలు..! సంచలన అడజడులు
కంగారు వద్దంటున్న ప్రభుత్వం..
అయితే దీనిపై అంత కంగారు పడాల్సిన పనిలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి గత అనుభవాలను ఉదహరిస్తున్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు ఉండేది ప్రభుత్వ పీడీ అకౌంట్లలోనేనని..బ్యాంకుల్లో కాదన్న విషయం గుర్తించుకోవాలని చెబుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉంటే ఇబ్బందులని.. ప్రభుత్వ సంరక్షణలో ఉంటే ఎటువంటి నష్టం ఉండదంటున్నారు.
సైబర్ నేరగాళ్ల బారిన చిక్కుకునే అవకాశం లేదంటున్నారు. దీంతో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు వాడుకున్నట్టు చెప్పకనే చెప్పింది. అలా వాడుకుంటే తప్పేమిటన్న ధోరణిలో వ్యవహరిస్తోంది. డీఏ బకాయిలతో పాటు ఇతరత్రా రాయితీలను ప్రభుత్వం నేరుగా జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇవన్నీ ప్రభుత్వ పీడీ అకౌంట్లలో ఉంటాయి. జీపీఎఫ్ కు ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తోంది. అటువంటప్పుడు నిధులు వినియోగించుకుంటే తప్పేమిటన్నది ప్రభుత్వ వాదన. దీనిని రుణ పరిమితి కింద కూడా చూపెడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కాగ్ వంటి సంస్థలకు లెక్కలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇతర రుణాలకు జీపీఎఫ్ ఖాతాల నుంచి నిధులను వినియోగిస్తోంది. అసలు అప్పులే లేవని బిల్డప్ ఇచ్చి రుణ పరిమితిని పెంచుకుంటోంది. పాలనలో ఇదో భాగమని… జీపీఎఫ్ నిధులు దుర్వినియోగం చేసే ఉద్దేశ్యం లేదని చెప్పుకొస్తోంది. సో దొంగ లెక్కలు చెప్పడానికి జీపీఎఫ్ నిధులు వినియోగించారన్న మాట.
Also Read:Mana Ooru Mana Badi Scheme: మన ఊరు మన బడి ఓ బడా కంపెనీకి