https://oktelugu.com/

Chiranjeevi- Rao Ramesh: చిరు రిక్వెస్ట్ కి హ‌ర్ట్ అయిన మెగా ఫ్యాన్స్ ! 

Chiranjeevi- Rao Ramesh: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ డమ్ కి కేరాఫ్ అడ్రెస్. నటనకే కాదు, నాట్య మయూరానికి కూడా ఆయనే ఆలవాలం, ఆయనే కొలమానం, అన్నిటికీ మించి తెలుగు వెండితెరకు ఆయన తిరుగులేని నాయకుడు. అందుకే, మెగాస్టార్ కి ఇంకెవరూ సాటి లేరు. మరొకరు ఎవరూ పోటీకి రారు. కానీ, చిరు తన స్థాయిని తానే తగ్గించుకోవడమే అభిమానులను బాధ పెడుతుంది. ఎంత లేదన్నా.. చిరంజీవి ఒక మెగాస్టార్‌. ప్రస్తుతం ఇండ‌స్ట్రీకి ఆయ‌నే […]

Written By:
  • Shiva
  • , Updated On : June 29, 2022 / 09:48 AM IST
    Follow us on

    Chiranjeevi- Rao Ramesh: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ డమ్ కి కేరాఫ్ అడ్రెస్. నటనకే కాదు, నాట్య మయూరానికి కూడా ఆయనే ఆలవాలం, ఆయనే కొలమానం, అన్నిటికీ మించి తెలుగు వెండితెరకు ఆయన తిరుగులేని నాయకుడు. అందుకే, మెగాస్టార్ కి ఇంకెవరూ సాటి లేరు. మరొకరు ఎవరూ పోటీకి రారు. కానీ, చిరు తన స్థాయిని తానే తగ్గించుకోవడమే అభిమానులను బాధ పెడుతుంది. ఎంత లేదన్నా.. చిరంజీవి ఒక మెగాస్టార్‌. ప్రస్తుతం ఇండ‌స్ట్రీకి ఆయ‌నే పెద్ద దిక్కు కూడా. ఆయన ఊ అంటే.. అది ఏదైనా నిమిషాల్లో జరిగిపోతుంది. అది చిరు స్థాయి.

    Chiranjeevi- Rao Ramesh

    అయితే, చిరు మాత్రం చిన్నాచితకా నటీనటులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘నాకు మీతో క‌లిసి న‌టించాల‌ని వుంది. మనం ఎప్పుడు కలిసి పని చేద్దాం’ అని అడుగుతూ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో కూడా రావు ర‌మేష్ తో చిరు ఇలాగే మాట్లాడారు. ‘నాతో క‌లిసి ఒక్క‌ సినిమా కూడా చేయ‌లేదు. మనం ఎప్పుడు కలిసి సినిమా చేద్దాం’ అంటూ చిరు.. రావు ర‌మేష్ ను అడగడం అందర్నీ షాక్ కి గురి చేసింది.

    Also Read: Actor Meena Husband Passed Away: నటి మీనా భర్త ఆకస్మిక మృతి.. అసలేం జరిగింది? మరణానికి కారణం ఏంటంటే?

    రావు రమేష్ ప్ర‌తిభావంతుడైన న‌టుడే, కానీ ఆయన హీరో కాదు. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి నటుడిని కూడా చిరు అడిగాడంటే… ఆశ్చ‌ర్యం వేస్తుంది. హేమా హేమీల్ని, స్టార్ హీరోలను అడిగినట్టు చిరు ఇలా సహాయ నటులను కూడా అడిగి, తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడు. అసలు రావు రమేశ్ కోసం కూడా చిరంజీవి ఇంతలా దిగజారిపోవాలా ? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    Chiranjeevi- Rao Ramesh

    అయినా చిరు ఇలా రిక్వెస్ట్ చేయడం కొత్త కాదు. గతంలో అనేక వేదిక‌ల పై హీరోయిన్లను కూడా చిరు ఇలాగే రిక్వెస్ట్ చేశాడు. ఆ మ‌ధ్య సాయి ప‌ల్ల‌వితో ‘నాకు నీతో క‌లిసి స్టెప్పులు వేయాల‌ని ఉంది’ అంటూ ముచ్చట పడ్డాడు. అంతకు ముందు త‌మ‌న్నాతో కూడా ఇదే ముక్క చెప్పాడు. మధ్యలో రాశి ఖన్నా విషయంలో చిరు ఇలాగే బిహేవ్ చేశాడు. ఇక రష్మికతో అయితే.. నీకు నేను రెగ్యులర్ గెస్ట్ ను అంటూ కామెంట్లు చేశాడు. ఇప్పుడు రావు రమేష్ వంతు వచ్చింది.

    ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన వాడే గొప్పోడు కావొచ్చు.. కానీ గొప్పోడు చిన్నోళ్ల దగ్గర తగ్గితే చీప్ గా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడు ఇలా త‌గ్గి మాట్లాడితే, ఆయన ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతారని చిరు గ్రహించలేకపోవడం ఆశ్చర్యకర విషయమే. ఇకనైనా మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకుని చిరు ఇలాంటివి తగ్గించాలని ఆశిద్దాం.

    Also Read: Sammathame 4th Day Collections: ‘సమ్మతమే’కి 4 డేస్ కలెక్షన్స్.. బాగానే పుంజుకుంది !

    Tags