Top 5 Tollywood Heroes In Remuneration: తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇండియా లో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీస్ కంటే నెంబర్ 1 స్థానం లో కొనసాగతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇటీవల కాలం లో విడుదలైన సినిమాలన్నీ మన ఇండస్ట్రీ ని ఆ స్థానం లో కూర్చోబెట్టాయి..బాహుబలి, బాహుబలి 2 , పుష్ప మరియు #RRR వంటి సినిమాలతో మన టాలీవుడ్ మార్కెట్ ఎవ్వరు అందుకోలేనంత రేంజ్ కి ఎదిగిపోయింది..దీనితో మన హీరోల రేంజ్ కూడా ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది..మన టాలీవుడ్ నుండి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 5 హీరోలెవ్వరో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ప్రభాస్:
ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపచేసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి..ప్రస్తుతం ఇండియా వైడ్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకి కూడా లేదు అని చెప్పొచ్చు..బాహుబలి సిరీస్ తర్వాత ఈయన చేసిన అట్టర్ ఫ్లాప్ సినిమా సాహూ కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన రాధే శ్యామ్ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది..కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఫ్లాప్ సినిమాలకు కూడా ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెడుతున్న ప్రభాస్ కి నిర్మాతలు ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయిలు ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు..ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు.
రామ్ చరణ్ :
ఇక ప్రభాస్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు..మొదటి సినిమా నుండే మాస్ ఇమేజి ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ కి ఉన్నంత సక్సెస్ రేట్ ఇండస్ట్రీ లో ఏ హీరో కి కూడా లేదు..ఒక్క మాములు యావరేజి సినిమాని కూడా సూపర్ హిట్ చెయ్యడం రామ్ చరణ్ కి ఉన్న ప్రత్యేకత..చేసిన 13 సినిమాలలో మగధీర మరియు రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన రామ్ చరణ్..ఇటీవల విడుదలైన #RRR సినిమా తో తన రేంజ్ ని పదింతలు పెంచుకున్నాడు..ముఖ్యంగా ఇతర దేశం లో ఉన్న సినీ ప్రేక్షకులు రామ్ చరణ్ నటనకి ఫిదా అయిపోయారు..అందరూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ని సాధిస్తే..రామ్ చరణ్ పాన్ వరల్డ్ స్థాయి లో గుర్తింపుని పొందాడు..ఆ స్థాయి ఇమేజి ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ నిర్మాతలు ఒక్కో సినిమాకి గాను 80 నుండి 100 కోట్ల రూపాయిల పారితోషికం ఆఫర్ చేస్తునట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్:
ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులు ఆయనని ఒక ఆరాధ్య దైవం లాగ భావిస్తారు..పవర్ స్టార్ సినిమా వచ్చిందంటే చాలు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ దుమ్ము లేచిపోతాయి..ఆయన సినిమాకి నిర్మాత పెట్టిన ఖర్చు మొత్తం సగానికి పైగా మొదటి రోజే వచ్చేస్తాయి..అందుకే పవన్ కళ్యాణ్ కి ఎన్ని రాజకీయ వత్తిడులు ఉన్నా..ఆయన సినిమా పై ఎన్ని రాజకీయ కుట్రలు చేసిన కూడా నిర్మాతలు ఒక్కో సినిమాకి 75 కోట్ల రూపాయిల పారితోషికం ఇవ్వడానికి వెనకాడట్లేదు..ఇటీవలే ఆయన తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా వినోదయ్యా సీతం అనే సినిమాని ఒప్పుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి గాను ఆయన 22 రోజుల డేట్స్ ని ఇచ్చాడు..ఈ 22 రోజులకు గాను పవన్ కళ్యాణ్ అక్షరాలా 54 కోట్ల రూపాయిలు తీసుకుంటున్నాడు..ఇక హరిహరవీర మల్లు సినిమాకి అయితే 75 కోట్ల రూపాయిలు తీసుకున్నట్టు సమాచారం..ఒక్క పాన్ ఇండియా సినిమా చెయ్యకుండా ఇంత మొత్తం లో పారితోషికం
తీసుకుంటున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పొచ్చు.
ఎన్టీఆర్:
ఇక మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నాల్గవ స్థానం లో కొనసాగుతున్నాడు..ఈయనకి ఒక్కో సినిమాకి ఇంతకు ముందు 30 నుండి 40 కోట్ల రూపాయిల పారితోషికం ఇచ్చేవారు నిర్మాతలు..కానీ #RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడం తో ఇప్పుడు ఈయనకి నిర్మాతలు ఒక్కో సినిమాకి 70 కోట్ల రూపాయిల పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు..ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా భారీ హిట్ అయితే ఆ తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ సినిమాకి 100 కోట్ల రూపాయిల పారితోషికం డిమాండ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.
అల్లు అర్జున్:
Also Read: YCP Politics: వైసీపీలో ‘కుట్ర’ కోణాలు..! సంచలన అడజడులు
ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాలీవుడ్ మొత్తాన్ని ‘తగ్గేదెలా’ అని అనిపించేలా చేసాడు ఈయన..పుష్ప సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ లో మిగిలిన హీరోలెవ్వరికి రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..క్రికెటర్స్ నుండి పొలిటిషన్స్ వరుకు ప్రతి ఒక్కరు పుష్ప మేనియా తో ఊగిపోయారు..పుష్ప సినిమా వరుకు ఒక్కో సినిమాకి 30 నుండి 35 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే అల్లు అర్జున్..పుష్ప 2 కి 70 కోట్ల ఉపయిల పారితోషికం డిమాండ్ చేస్తునట్టు సమాచారం..ఈ సినిమా హిట్ అయితే ఆ తదుపరి చిత్రానికి అల్లు అర్జున్ ఇండియా లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతాడని ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ.
మహేష్ బాబు :
ఇక టాలీవుడ్ లో అత్యధిక వంద కోట్ల షేర్స్ ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..ఈయన శ్రీమంతుడు సినిమా నుండి రెమ్యూనరేషన్ తీసుకోవడం మానేసి..సినిమాకి వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..అందుకే ఈయన రెమ్యూనరేషన్ ని ఎవ్వరు అంచనా వెయ్యలేకున్నారు..అయితే ఆయనకీ ఉన్న మార్కెట్ వేల్యూ ప్రకారం ఒక్కో సినిమాకి 65 నుండి 70 కోట్ల పారితోషికం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది..ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ద్వారా మహేష్ బాబు కి దాదాపుగా 65 కోట్ల రూపాయిల పారితోషికం అందుతున్నట్టు సమాచారం..ఇప్పటి వరుకు పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వని మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..ఈ సినిమాతో ఆయన వంద కోట్ల రూపాయిల పారితోషికం తీసుకునే హీరోల లిస్ట్ లో చేరుతాడని అంచనా.
Also Read: Chiranjeevi- Rao Ramesh: మెగాస్టార్ మాటలకు మెగా ఫ్యాన్స్ హర్ట్.. చిరు మారు
Recommended Videos