https://oktelugu.com/

మద్యం ప్రియులకు మరోసారి షాక్..!

రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. తాజాగా మరో షాక్ ఇచ్చెందుకు సిద్ధమయ్యింది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం దశల వారీగా మద్య నిషేధం పేరుతో ఉన్న ధరలను పెంచడంతో ప్రజలను మద్యానికి దూరం చేయవచ్చనే నెపంతో కొద్దీ నెలల కిందట ధరలు పెంచారు. తాజాగా ప్రభుత్వం మళ్లీ ఇదే ఆలోచన చేస్తోంది. ఏపీలో 1600కు చేరువలో కరోనా కేసులు కరోనా కారణంగా లాక్ డౌన్ తో పూర్తిగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 3, 2020 / 05:25 PM IST
    Follow us on


    రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. తాజాగా మరో షాక్ ఇచ్చెందుకు సిద్ధమయ్యింది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం దశల వారీగా మద్య నిషేధం పేరుతో ఉన్న ధరలను పెంచడంతో ప్రజలను మద్యానికి దూరం చేయవచ్చనే నెపంతో కొద్దీ నెలల కిందట ధరలు పెంచారు. తాజాగా ప్రభుత్వం మళ్లీ ఇదే ఆలోచన చేస్తోంది.

    ఏపీలో 1600కు చేరువలో కరోనా కేసులు

    కరోనా కారణంగా లాక్ డౌన్ తో పూర్తిగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం మద్యం ధరలు పెంచి ఆ లోటును కవర్ చేసుకోవాలనుకుంటుంది. మధ్యం ధరలను 25 శాతం పెంచాలని భావిస్తోంది. దీంతో గతంలో రూ. 200 ఉన్న బాటిల్ ధర ప్రస్తుతం రూ.250కి పెరగనుంది. అయితే మద్యపానాన్ని నియంత్రించడం, రద్దీని తగ్గించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు రానున్నరోజుల్లో మరిన్ని దుకాణాల సంఖ్య తగ్గించనున్నారని సమాచారం.

    కోడెల `ఆత్మహత్య’ మిస్టరీపై టీడీపీ, వైసీపీ రాజకీయం!

    కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 4వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షాపుల వద్ద తీసుకోవాల్సిన చర్యలను ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ప్రతి షాపు వద్ద ఆరుగురు వ్యక్తులకు మించి ఉండకూడదని, భౌతిక దూరం పాటించడం, వంటి చర్యలు తీసుకోనున్నారు. షాప్ ల వద్ద పరిమిట్ రూమ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లకు అనుమతి లేదు. మాల్స్ లోను మద్యం విక్రయాలకు అవకాశం లేదు.