రంగమ్మత్త అర్జున్ అభిమాని అంట!

జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ అంతకంటే ఎక్కువ పేరు రంగస్థలం చిత్రం తో దక్కించు కొంది. అలా టి. వి , సినీ రంగాల్లో వచ్చిన ఇమేజ్ తో కెరీర్ని బాగానే నెట్టుకొస్తోంది. ఇపుడు అడపా తడపా సినిమా ల్లో నటిస్తూ నటిగా కూడా మంచి పేరు సంపాదిస్తోంది . అనసూయ టాలెంట్ కి తగ్గట్టు ప్రాధాన్యం ఉన్న రోల్స్ వస్తున్నాయి కూడా …. రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ […]

Written By: admin, Updated On : May 3, 2020 5:32 pm
Follow us on


జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ అంతకంటే ఎక్కువ పేరు రంగస్థలం చిత్రం తో దక్కించు కొంది. అలా టి. వి , సినీ రంగాల్లో వచ్చిన ఇమేజ్ తో కెరీర్ని బాగానే నెట్టుకొస్తోంది. ఇపుడు అడపా తడపా సినిమా ల్లో నటిస్తూ నటిగా కూడా మంచి పేరు సంపాదిస్తోంది . అనసూయ టాలెంట్ కి తగ్గట్టు ప్రాధాన్యం ఉన్న రోల్స్ వస్తున్నాయి కూడా …. రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర చేసిన తరవాత కథనం మూవీలో హీరోయిన్ గా కూడా నటించడం జరిగింది.

ఏపీలో 1600కు చేరువలో కరోనా కేసులు

అలా సెలబ్రిటీ గా మారిన ఈ గ్లామర్ యాంకర్ కి ఫెవరేట్ హీరో ఎవరని ఒక పాత్రికేయుడు అడిగితే టక్కున `యాక్షన్ కింగ్ అర్జున్ ` పేరు చెప్పింది. 1993 లో యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్ మెన్ మూవీ చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయిందట. నిజానికి ఆ రోజుల్లో అర్జున్ ఆమె క్రష్ అని కూడా చెప్పుకొచ్చింది. రంగమ్మత్త .