అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ నకు ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ కోర్టుల్లో వేస్తున్న కేసులన్నంటిలోనూ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఇక ఆయన అధ్యక్ష పదవి కోసం ఆశలు వదులుకోవడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.
Also Read: ఈ విధ్వంసం వెనుక ఆయనున్నారు: డీజీపీకి బాబు లేఖ
తాజాగా కీలక రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలంటూ రిపబ్లికన్లు వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇక సోమవారం ఎలక్టోరల్ కాలేజీ సమావేశమై తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనుంది.
నవంబర్ నుంచి సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ కోర్టల్లో పిటిసన్ వేస్తున్నారు. మేజిక్ ఫిగర్ కు ఎంతో దూరంలో ఉన్న ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల అమెరికాలోని కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్, విస్కాన్సిన్ ఎన్నికల ఫలితాలలో అవకతవకలు జరిగాయని, అక్కడి ఓట్లను రద్దు చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
Also Read: ఏపీ మంత్రికి కంట్లో నలుసుగా మారిన జనసేన నేత..!
ఇందులో భాగంగా టెక్సాస్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు 26 మంది, అటార్ని జనరళ్లు 17 మంది కలిసి చివరి ప్రయత్నంగా వ్యాజ్యం వేశారు. అయితే సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది.
అమెరికాలో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ తనది ఓటమి కాదని వాదిస్తూ వస్తున్నారు. ఎలక్షన్ కమిష్ అధికారులు కలిసి కుట్రలు పన్నారని, తనను రెండోసారి అధ్యక్షుడిగా కాకుండా చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తన ప్రత్యర్థి జో బైడేన్ వ్యాపారులతో కలిసి ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే ఆయన వేసిన ప్రతీ పిటిషన్ ను కోర్టులు తిరస్కరిస్తూ వస్తున్నాయి. దీంతో ఇక ఆయన ఓటమిని ఒప్పుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు