దేశంలో కరోనా గురించి మరో సంచలన సర్వే

కరోనా కల్లోలం ఏడాదికోమారు వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మొదటి వేవ్ ను తట్టుకున్న భారతదేశంలో సెకండ్ వేవ్ జనాలను పిట్టల్లా రాల్చేసింది. ఆ దెబ్బకు లక్షలమంది తమ వారిని కోల్పోయారు. సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదం నుంచి ఇప్పటికీ దేశం కోలుకోవడం లేదు. ఇక సెకండ్ వేవ్ విషాదం తర్వాత ప్రభుత్వం దేశ ప్రజలకు వేగంగా వ్యాక్సినేషన్ చేయిస్తూ అందరికీ టీకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ఇప్పుడు వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఈ క్రమంలోనే […]

Written By: NARESH, Updated On : July 21, 2021 10:09 am
Follow us on

కరోనా కల్లోలం ఏడాదికోమారు వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మొదటి వేవ్ ను తట్టుకున్న భారతదేశంలో సెకండ్ వేవ్ జనాలను పిట్టల్లా రాల్చేసింది. ఆ దెబ్బకు లక్షలమంది తమ వారిని కోల్పోయారు. సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదం నుంచి ఇప్పటికీ దేశం కోలుకోవడం లేదు.

ఇక సెకండ్ వేవ్ విషాదం తర్వాత ప్రభుత్వం దేశ ప్రజలకు వేగంగా వ్యాక్సినేషన్ చేయిస్తూ అందరికీ టీకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ఇప్పుడు వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది.

ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ఆందోళనలు దేశంలో మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) జాతీయ స్థాయిలో చేపట్టిన నాలుగో సెరో సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశ జనాభాలో 67శాతం మందిలో కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్రప్రభుత్వం సంచలన విషయాన్ని బయటపెట్టింది. మరో 40 కోట్ల మందికి మాత్రమే కరోనా వైరస్ ముప్పు పొంచి ఉందని తెలిపింది.

ఈసారి థర్డ్ వేవ్ లో పిల్లలపై కరోనా ప్రభావం చూపుతుందని ఐసీఎంఆర్ అంచనావేస్తోంది. దేశంలో 6 ఏళ్ల వయసు పైబడిన 67.6శాతం మందిలో కోవిడ్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.6-17 ఏళ్ల వయసున్న వారిలో 50శాతం కోవిడ్ ప్రభావానికి గురైనట్లు తాజా సర్వేలో తేలిందన్నారు.

దేశంలో ప్రస్తుతం 45-60 ఏళ్ల వయసున్న వారు రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. వారిలో అత్యధికంగా 77.6శాతం యాంటీబాడీలున్నాయి. ఒకడోసు తీసుకున్న వారికి ఇంకాస్త తక్కువగా 76శాతం ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక దేశ యువత, నడివయసు వారికి కరోనా ముప్పు తగ్గినట్టేనని ఐసీఎంఆర్ సంచలన నివేదికను బయటపెట్టింది.