
తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. నూతన ధరలు ఈనెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పాత ధరల్లో రిజిస్ట్రేషన్లకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో భూముల క్రయ విక్రయాలు నిమిత్తం జనాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలో ఏడేంళ్ల తర్వాత తొలిసారి భూముల విలువను ప్రభుత్వం సవరించింది. ప్రజలపై భారం పడకుండా పట్టణాలు, నగరాలవారీగా భూముల విలువ పెరిగినట్లుగా సమాచారం.