https://oktelugu.com/

హైకోర్టులో మరో పిటిషన్.. ఆ మంత్రులకు ‘రంగు’ పడుద్దా?

జగన్ సర్కారుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాజకీయ.. ప్రజాసంఘాల నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. Also Read: రాజకీయాల్లో సూపర్ స్టార్ కంటే పవర్ స్టార్ నయమా? దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలుకానన్ని పిటిషన్ ఒక్క ఏపీ సర్కారుపైనే దాఖలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 / 02:01 PM IST
    Follow us on

    జగన్ సర్కారుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాజకీయ.. ప్రజాసంఘాల నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.

    Also Read: రాజకీయాల్లో సూపర్ స్టార్ కంటే పవర్ స్టార్ నయమా?

    దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలుకానన్ని పిటిషన్ ఒక్క ఏపీ సర్కారుపైనే దాఖలు అయ్యాయంటే అతిశయోక్తి కాదేమో..  దీంతో జగన్ పాలనపై దృష్టిసారించలేకపోతున్నారనే టాక్ విన్పిస్తోంది. అధికారులు వీటిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా న్యాయస్థానాలను మాత్రం మెప్పించడంలో ప్రభుత్వం మాత్రం చతికిలపడుతోంది. తాజాగా మరోసారి రంగుల వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

    ఏపీలో ప్రభుత్వ భవనాలకు వైఎస్సాఆర్సీపీ రంగులను వేశారని పలువురు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం వేసిన రంగులను తొలగించి అందుకు ఖర్చుచేసిన 4వేల కోట్లను ప్రభుత్వ ఖాజనాలో జమ చేయించాలని పిటిషన్ కోరాడు. సీఎస్ నీలం సాహ్ని.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. బొత్స సత్యనారాయణలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చాడు.

    Also Read: ‘ఏమనాలి వీణ్ణి..’ సీఎం జగన్ పై చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు

    దీనిని పరిశీలించిన కోర్టు ప్రతీవాదులుగా సీఎస్.. మంత్రులను ఎందుకు చేర్చారో చెప్పాంటూ హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. అయితే గతంలోనే హైకోర్టు రాజకీయ పార్టీల రంగులను పోలివున్న కలర్స్ ను ప్రభుత్వ కార్యాయాలకు వినియోగించొద్దని ఆదేశించింది. ఈనేపథ్యంలోనే జగన్ సర్కార్ ఎర్రమట్టి.. ఆకుపచ్చ.. నీలం.. తెలుపు రంగులను మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలకు వాడాలంటూ జీవో 623ని తీసుకొచ్చింది.

    అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం తీసుకొచ్చిన 623జీవోను కొట్టిపారేసింది. రంగుల వివాదంపై ఈనెల 28లోగా సీఎస్.. పంచాయతీ శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనట్లయితే కోర్టు ధిక్కారణ కింద పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ అధికారులు రంగుల వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతారనేది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్