https://oktelugu.com/

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ?

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయ. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఉండగా మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి బీజాలు పడుతున్నట్లు తెలుస్తోంది. బహుజనుల కోసం గతంలో బహుజన సమాజ్ పార్టీ ఉన్నా దాని ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. ఈ నేపథ్యంలో వారి ఆత్మగౌరవమే ఆలంబనగా మరో పార్టీ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ […]

Written By: , Updated On : July 25, 2021 / 07:54 PM IST
Follow us on

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయ. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఉండగా మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి బీజాలు పడుతున్నట్లు తెలుస్తోంది. బహుజనుల కోసం గతంలో బహుజన సమాజ్ పార్టీ ఉన్నా దాని ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. ఈ నేపథ్యంలో వారి ఆత్మగౌరవమే ఆలంబనగా మరో పార్టీ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

సమాజంలో అణగారిని వర్గాలదే అధిక జనాభా. అయినా అధికారంలో వారు ఎప్పుడు వెనుకంజలోనే ఉంటున్నారు. వారిలో ఐకమత్యం లోపించిందనే వాదన కూడా ఉంది. దీంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే క్రమంలో పార్టీ రావాల్సని అవసరం ఏర్పడింది. ఇప్పటికే పలువురు దీనిపై కసరత్తు కూడా చేశారు. పార్టీ ఆవిర్భావానికి గల దారులు వెతుకుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం రాజకీయాల వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.

దీంతో బహుజనుల పక్షాన పార్టీ పెట్టాలనే ఆలోచన చాలా మందిలో కలిగినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భవిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఏకం చేసే పనిలో భాగంగా ఐకమత్యాన్ని నింపి పోరాడేందుందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ పార్టీల పరంపరలో మరో నూతన పార్టీ ఏర్పాటు కావడం అందరికి ఆమోదయోగ్యమే అని వాదన వినిపిస్తోంది.