https://oktelugu.com/

ఆంధ్రజ్యోతి ఖాతాలో మరో లీగల్‌ నోటీస్‌

మీడియాలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌లా నిలుస్తోంది ఆంధ్రజ్యోతి మీడియా అనే టాక్ మీడియా సర్కిల్స్ లో ఉంది.. అందులోనూ ప్రతీ ఆదివారం ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ రాసే కొత్తపలుకు కూడా వివాదస్పదమవుతోంది. తాజాగా.. రాధాకృష్ణకు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే ఎన్నో వార్తలకు లీగల్‌ నోటీసులు అందుకుంటున్న ఆ పేపర్‌‌కు.. మరో లీగల్‌ నోటీసు అందింది. తాజాగా ఆ పేపర్‌‌లో వచ్చిన ‘రెడ్డీఆంధ్రజ్యోతి ఖాతాలో మరో లీగల్‌ నోటీస్‌స్‌తో డేంజరే’ అనే కథనానికి వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 8:22 pm
    Follow us on

    Andhra Jyothi media

    మీడియాలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌లా నిలుస్తోంది ఆంధ్రజ్యోతి మీడియా అనే టాక్ మీడియా సర్కిల్స్ లో ఉంది.. అందులోనూ ప్రతీ ఆదివారం ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ రాసే కొత్తపలుకు కూడా వివాదస్పదమవుతోంది. తాజాగా.. రాధాకృష్ణకు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే ఎన్నో వార్తలకు లీగల్‌ నోటీసులు అందుకుంటున్న ఆ పేపర్‌‌కు.. మరో లీగల్‌ నోటీసు అందింది. తాజాగా ఆ పేపర్‌‌లో వచ్చిన ‘రెడ్డీఆంధ్రజ్యోతి ఖాతాలో మరో లీగల్‌ నోటీస్‌స్‌తో డేంజరే’ అనే కథనానికి వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లీగల్‌ నోటీస్‌ జారీ చేశారు.

    Also Read: చంద్రబాబు, అదానీ, ఓ జగన్.. కథ

    తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరుతో ఈ కథనం ప్రచురితమైంది.  కానీ.. వాస్తవానికి ఆమె వ్యాఖ్యలను అనుకరించి.. ఆడియో క్లిప్‌ ప్రసారం చేసినట్లు ఇప్పటికే ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పీఎస్‌లో దీనిపై కేసు కూడా నమోదైంది. సోషల్‌ మీడియాలో దానిని పోస్ట్‌ చేసిన వారిని విచారించి.. ఆ ఆడియో క్లిప్‌ వెనుక అసలు కారకులు ఎవరనేది గుర్తించే పనిలో ఉన్నారు. అయితే.. అదే సమయంలో అసలు ఆ ఆడియో క్లిప్‌ వాస్తవమా కాదా అని నిర్ధారించుకోకుండా ప్రసారం చేసి.. ప్రచురించినందుకు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక చిక్కుల్లో పడింది.

    ఇప్పటికే పోలీసులు ఆ ఆడియో క్లిప్‌పై విచారణ కొనసాగిస్తుండగా.. రాధాకృష్ణ ఏకంగా వార్త ప్రచురించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఆడియో సృష్టికర్తలు వెలుగులోకి వస్తే మాత్రం రాధాకృష్ణ ఇరుక్కోక తప్పదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించి.. సమాజంలో విద్వేష వాతావరణం పెంచే ప్రయత్నంలో ఇలాంటి కథనాలు రాసినట్లు వారు నోటీసులో పేర్కొన్నారు.

    Also Read: చదువులకు బ్రేక్: ఇంటర్ క్లాసులు మళ్లీ వాయిదా

    ఒకవేళ అదే అభియోగం నిజమైతే మాత్రం సమాజంలో శాంతి విచ్ఛాన్నానికి కుట్ర పన్నారనే ఆయనపై కేసు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా ఏ పేపర్‌‌లోనైనా ఏ వివాదస్పద కథనం అయినా ప్రచురించేటప్పుడు సంబంధిత వివరణలు తీసుకుంటుంటాం. కానీ.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ క్లిప్ప్పింగ్‌ను పట్టుకొని ఇలా ప్రచురిస్తే ఎవరైనా ఇరుక్కోక తప్పదు కదా.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్