https://oktelugu.com/

దీపావళి టపాసులతో బండ్ల గణేష్.. నెటిజన్ల కౌంటర్..!

బండ్ల గణేష్ టాలీవుడ్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. కామెడీయన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతడిని సినీ అభిమానులంతా పవన్ కల్యాణ్ అభిమానిగా.. గబ్బర్ సింగ్ నిర్మాతగానే చూస్తుంటారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ నిత్యం ఏదో వివాదంలో ఇరుక్కుంటూ నెటిజన్ల చేతిలో బుక్కవడం ఇటీవలీ కాలంలో అతడికి అలవాటుగా మారింది. Also Read: ‘ఆదిపురుష్’లో ప్రభాస్ జోడీగా ఎవరంటే? బండ్ల గణేష్ మాత్రం కరోనా బారినపడి కోలుకున్నాక వివాదాల జోలికి వెళ్లడం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 06:52 PM IST
    Follow us on

    బండ్ల గణేష్ టాలీవుడ్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. కామెడీయన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతడిని సినీ అభిమానులంతా పవన్ కల్యాణ్ అభిమానిగా.. గబ్బర్ సింగ్ నిర్మాతగానే చూస్తుంటారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ నిత్యం ఏదో వివాదంలో ఇరుక్కుంటూ నెటిజన్ల చేతిలో బుక్కవడం ఇటీవలీ కాలంలో అతడికి అలవాటుగా మారింది.

    Also Read: ‘ఆదిపురుష్’లో ప్రభాస్ జోడీగా ఎవరంటే?

    బండ్ల గణేష్ మాత్రం కరోనా బారినపడి కోలుకున్నాక వివాదాల జోలికి వెళ్లడం లేదు. పూర్తిగా శాంతస్వరూపుడిగా మారిపోయాడు. కాంట్రావర్సీలకు వీలైనంత దూరంగా ఉంటూ గతంలో తన మాటల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ కోరుతున్నాడు. తనకు తోచిన సాయం అందిస్తూ అందరిచేల ప్రశంసలు అందుకుంటున్నాడు.

    కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తనకు తెలిసిన చోట ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. తనకు తోచినవిధంగా డబ్బులు అందిస్తున్నాడు. పిల్లలకు పుస్తకాలను కొనిస్తూ తెలుగు సోనూసూద్ అని పేరుతెచ్చుకుంటున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఫుల్ బీజీగా గడుపుతున్నాడు. అయితే తాజా బండ్ల గణేష్ పోస్టును చూసి అతడిని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

    Also Read: గురువుని కలసిన మెగాస్టార్.!

    దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ తన ఫేసుబుక్ ఓ పోస్టు పెట్టాడు. తన ఇంట్లో ఉన్న క్రాకర్స్.. పటాసులన్నింటినీ ఒకేచోట చేర్చి ఇంటి ముందు ఫొటో దిగాడు. ఓ షాపును తలపించేలా పటాసులు ఉండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పటాసుల షాపు ఏమైనా పెట్టావా?.. అడ్రస్ ఎక్కడో చెబితే వచ్చి కొంటామంటూ పలువురు నెటిజన్లు సైటర్లు వేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మరికొందరేమో పటాసుల బ్యాన్ చేశారు కదా.. ఎందుకు అంత కొన్నావ్.. కాలుష్యం పెరిగిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేష్ పటాసులతో ఏదో సందేశం ఇద్దామనుకుంటే ఇంకోలా బుక్ అయినట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ పండుగ పూట కూడా నెటిజన్ల చేతిలో బుక్కై నవ్వులు పూయిస్తుండటం విశేషం.