https://oktelugu.com/

స్వరూపానంద.. ఏపీకి దేవుడవయ్యా!

ఏపీ దేవాదాయ శాఖ మరోసారి వివాదంలో చిక్కుకుంది. విశాఖ స్వరూపానంద స్వామి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక మర్యాదలు, పూజలు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు రాద్ధాంతం అయ్యాయి. ఈ నెల 18న స్వరూపానంద జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పీఠం అయిన శారదాపీఠం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Also Read: చదువులకు బ్రేక్: ఇంటర్ క్లాసులు మళ్లీ వాయిదా ఆయన పీఠం.. ఆయన ఖర్చులు కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పరు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 06:44 PM IST
    Follow us on

    ఏపీ దేవాదాయ శాఖ మరోసారి వివాదంలో చిక్కుకుంది. విశాఖ స్వరూపానంద స్వామి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక మర్యాదలు, పూజలు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు రాద్ధాంతం అయ్యాయి. ఈ నెల 18న స్వరూపానంద జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పీఠం అయిన శారదాపీఠం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    Also Read: చదువులకు బ్రేక్: ఇంటర్ క్లాసులు మళ్లీ వాయిదా

    ఆయన పీఠం.. ఆయన ఖర్చులు కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పరు. పీఠం ఖర్చులతో ఆలయాల్లో ప్రత్యేకంగా తమ ఖర్చులు పెట్టుకుని పూజలు చేయించుకుంటే సమస్య వచ్చేది కాదు . కానీ.. శారదా పీఠం తరఫున ప్రభుత్వానికి.. ఓ విజ్ఞాన పత్రం వెళ్లింది. అందులో.. ఏపీలోని ప్రముఖ ఆలయాల జాబితాను చేర్చారు. స్వరూపానంద జన్మదినోత్సవం సందర్భంగా తాము చెప్పిన ఆలయాల్లో ప్రత్యేక ఆలయ మర్యాదలు పూజలు చేయాలని అందులో కోరారు.

    అసలే ఆయన రాజ గురువు.. అలా కోరిన తర్వాత కూడా స్పందించకపోతే.. ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తుందనుకున్నారో లేకపోతే పైనుంచే ఆదేశాలు వచ్చాయో కానీ వారు అడిగినట్లుగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేకమైన ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశిస్తూ దేవాదాయ కమిషనర్ మాత్రం ఆదేశాలు జారీ చేశారు.

    Also Read: చంద్రబాబు, అదానీ, ఓ జగన్.. కథ

    స్వరూపానంద ఓ స్వయం పీఠాధిపతి మాత్రమే. ఆయనకు ఎలాంటి ప్రత్యేకమైన హోదా లేదు. కానీ ప్రభుత్వ పెద్దల అండ ఉందన్న ఉద్దేశంతో ఆయన పట్ల అధికారులు కూడా గౌరవ భావంతో మెలుగుతున్నారు. రాజును మించి రాజభక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇలా దేవాయాల్లో ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయడం అంటే ఓ రకంగా ఏపీలో దేవాలయాలపై ఆయనకు ఎవరికీ లేనంత పట్టు ఉందని ప్రభుత్వం చెప్పడమే అవుతుంది. అయితే.. ఇప్పుడు దేవాదాయ శాఖ నిర్ణయంపై రాష్ట్రమంతా నిరసన వ్యక్తం అవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్