YCP Kodi kathi Drama: పొలిటిక్స్ అన్నాక విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. ఆరోపణలు, ప్రత్యోరోపణలు సహజం. కానీ ఇటీవల ఇవి స్థాయికి మించిపోయాయి. పరస్పరం భౌతిక దాడుల వరకూ దిగివచ్చాయి. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రుల కాన్వాయ్ పై జనసేన శ్రేణులు దాడులు చేశాయని ఏకంగా కేసులు నమోదుచేశారు. రిమాండ్ కు తరలించి రాంగ్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. అదే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం జనసేన కార్యాలయంపై దాడిచేశారు. ఫర్నీచర్, విలువైన సామగ్రిని ధ్వంసంచేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన అనుచరులే ఈ ఘటనకు పాల్పడ్డారని అనుమానిస్తూ జనసేననేతలు ఫిర్యాదుచేసినా ఇప్పటివరకూ కేసు నమోదుచేయలేదు సరికదా.. దీనిపై సరైన యాక్షన్ తీసుకోలేదు. అయితే ఇంతలోనే రాష్ట్ర ఇంటెల్లిజెన్స్ విభాగం హడావుడి ప్రారంభమైంది, మంత్రులు, వైసీపీ కీలక ఎమ్మెల్యేల కాన్వాయ్ పై భౌతిక దాడులు జరుగుతాయని నిఘా విభాగం హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. అదంతా జనసేనను టార్గెట్ చేస్తూ అలెర్ట్ చేయడం వెనుక కుట్ర ఉందని జనసైనికులు అనుమానిస్తున్నారు. మరో కోడికత్తి డ్రామాకు తెరలేపుతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే నిఘా విభాగాల హెచ్చిరిక అంటూ ఒక లీకు బయటకు రావడంతో మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. వైసీపీ మంత్రులపై దాడులు.. నిఘా విభాగం హెచ్చరికలంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందన్నారు. విలువైన సమయం ఇలా కుట్ర రాజకీయాలకు కాకుండా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు వినియోగించాలన్నారు. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీక్రెట్ గా పంపిన సర్క్యులర్ ఎలా బయటపడిందని.. అదంతా జనసేనపై అటాక్ చేయ్యడానికేనని ఆరోపించారు. విశాఖలో చేసిన హడావుడి అంతా తెలుసునని.. మరో కోడికత్తిలాంటి డ్రామా ట్రాప్ లో పడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని నాగబాబు షటైరికల్ గా కామెంట్స్ చేశారు. ఈ ఏడాదిన్నరలో బెటర్ గా పనిచేసి,,, ఫలితాలను మెరుగుపరచుకోండి అంటూ సలహా ఇచ్చారు. లేకపోతే గౌరవప్రదమైన ఓటమి కూడా దక్కేలా లేదు అంటూ చురకలు అంటించారు.

అసలు నిఘా వర్గ హెచ్చరికలు ఎలా బయటకు వస్తున్నాయని జనసేన నేత నాదేండ్ల మనోహర్ ప్రశ్నించారు. డీజీపీ కార్యాలయ అనుసంధానంగా మీడియాకు వార్తలు రావడమేమిటని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను పక్కనపెట్టుకొని చేసే కుట్రలకు చెల్లవని.. కోడికత్తిలాంటి డ్రామా అందరికీ తెలిసిపోయిందని.. ఏదైనా కొత్తగా ట్రై చేయండని సలహా ఇచ్చారు. అధికార పార్టీ ట్రాప్ లో ఎవరూ పడవద్దని.. ధైర్యంగా ఎదుర్కొండి అని పవన్ పిలుపునిచ్చారు. ధైర్యం ఉన్నవారే తన వెంట నడవాలని కూడా పిలుపునిచ్చారు. అయితే నిఘా వర్గాల హెచ్చరిక అంటూ మీడియాకు లీకులిచ్చిన వైసీపీ ప్రభుత్వానికి.. జనసేన వర్గాలు ముందే అప్రమత్తం కావడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు.