https://oktelugu.com/

అచ్చెన్నకు మరో భారీ పంచ్..

వైపీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలను ఓ ఆటాడేసుకుంటోంది. విడతల వారీగా పచ్చ తమ్ముళ్లకు పంచ్ లు ఇస్తూనే వస్తోంది. ఇప్పటికే వివిధ కేసుల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లను జైలు పాలు చేసిన వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లోనూ పాతాలానికి తొక్కేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాకాలోనే పచ్చ పార్టీ మద్దతుదారులకు ఓటమి తప్పలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. Also Read: భారీ డైలాగులు.. పనిచేయనికి వ్యూహాలు.. ఉత్తరాంధ్రకే పేరున్న ఉత్తమ లీడర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 28, 2021 / 12:42 PM IST
    Follow us on


    వైపీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలను ఓ ఆటాడేసుకుంటోంది. విడతల వారీగా పచ్చ తమ్ముళ్లకు పంచ్ లు ఇస్తూనే వస్తోంది. ఇప్పటికే వివిధ కేసుల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లను జైలు పాలు చేసిన వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లోనూ పాతాలానికి తొక్కేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాకాలోనే పచ్చ పార్టీ మద్దతుదారులకు ఓటమి తప్పలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

    Also Read: భారీ డైలాగులు.. పనిచేయనికి వ్యూహాలు..

    ఉత్తరాంధ్రకే పేరున్న ఉత్తమ లీడర్ కింజరాపు అచ్చెన్నాయుడు. ఏపీ టీడీపీ పార్టీకి అధ్యక్షుడు. ఆయన ఉంటే చాలు ఉత్తరాంధ్ర జిల్లాలలో పసుపు పార్టీ పదిలం అని అధినేత చంద్రబాబు తలచారు. ఆయన్ను ఎరికోరి మరీ ఎంపిక చేసి కిరీటం అప్పగించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళంలో ఫలితాలు తేడా కట్టాయి. ఇక అక్కడితో ఆగకుండా వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది.

    Also Read: ఒప్పుకోని కుప్పం.. మేలుకున్న బాబు

    ఏకంగా నలుగురు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సడెన్ గా వైపీసీ జెండా కప్పుకోవడం ద్వరా పలాసా టీడీపీని పరేషన్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కండువాలు మార్చడం పాత ట్రెండ్ అయినప్పటికీ.. ఇప్పుడు అభ్యర్థులే మూకుమ్మడిగా పార్టీలు మారడం చర్చనీయాంశంగా అనిపిస్తోంది. మొత్తానికి పలాసాలో కులాసాగా గెలుద్దామనుకున్న టీడీపీకి ఇది పెద్ద షాక్ అనే అభివర్ణించాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    సొంత జిల్లాలో టీడీపీ కోట ఇలా కూలిపోతుందంటే.. అచ్చెన్నకు అతి పెద్ద దిగాలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో వైపు మాజీ మంత్రి.. పలాస మాజీ ఎమ్మెల్యే.. గౌతు శ్యమసుందర శివాజీ అయితే ఇది దారుణమైన అన్యాయం అంటున్నారు. ఎవరు అరిచి గావుకేకలు పెట్టినా.. ఇది రాజకీయం. అంతే ఉంటుంది. నాడు 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ లాగేసినప్పుడు ఈ గావుకేకలు ఏమయ్యాయని వైపీసీ నేతలు అంటున్నారంటే.. రాజకీయ చదరంగంలో టీడీపీ తడబాట్లు పొరపాట్లు బయటపడుతున్నాయని అనుకోవాలి.