సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్..

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో జవాబుదారి తనం పెంచేందుకు రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధలను తెరపైకి తీసుకొస్తుంది. హాజరుకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ.. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో పంచ్ పనిచేయడం లేదని.. ఆన్ డ్యూటీ.. అంటూ తప్పించుకున్నారు. సంతకాలతో హాజరుపట్టీ నింపేశారు. అయితే హాజరుశాతంపై నిఘా పెట్టిన ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ.. ఉత్తర్వులిచ్చింది. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ వాడకపోతే.. ఆరోజు జీతంలో కోత పడుతుంది. Also […]

Written By: Srinivas, Updated On : February 28, 2021 12:52 pm
Follow us on


ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో జవాబుదారి తనం పెంచేందుకు రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధలను తెరపైకి తీసుకొస్తుంది. హాజరుకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ.. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో పంచ్ పనిచేయడం లేదని.. ఆన్ డ్యూటీ.. అంటూ తప్పించుకున్నారు. సంతకాలతో హాజరుపట్టీ నింపేశారు. అయితే హాజరుశాతంపై నిఘా పెట్టిన ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ.. ఉత్తర్వులిచ్చింది. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ వాడకపోతే.. ఆరోజు జీతంలో కోత పడుతుంది.

Also Read: అచ్చెన్నకు మరో భారీ పంచ్..

జీతానికి, బయోమెట్రిక్ కి అనుసంధానం చేసినట్లు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు సాయంత్రం 3గంటల నుంచి 5 గంటల వరకు విధిగా సచివాలయంలోనే ఉండాలని, ఆ సమయంలో స్పందన కార్యక్రమం నిర్వహంచి.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లు పని ఉన్నరోజు ఆఫీసుకు వెళ్లి.. పని లేదనుకుంటే.. ఇంటిదగ్గరి నుంచే వ్యవహారాలు నడిపించారు ఉద్యోగులు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే రిజిష్టర్ లో సంతకాలు చేసేవారు.

Also Read: భారీ డైలాగులు.. పనిచేయనికి వ్యూహాలు..

ఆ మధ్య ఎంపీడీవోలు.. ఎమ్మార్వోలు తనిఖీలు నిర్వహించినా.. అసలు పని మానేసి.. తనిఖీలకే సమయం అంతా వృథా అవుతుండడంతో దాన్నీ పక్కన పడేశారు. దీంతో సచివాలయ ఉద్యోగులు వారి పనితీరుపై చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు అధికారులు. దీంతోపాటు సాయంత్రం 3నుంచి 5 గంటల వరకు కచ్చితంగా సచివాలయంలోనే ఉండాలనే నిబంధన విధించారు. ఆ సమయంలో ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

రేషన్ కార్డు, పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు వంటి వాటిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలనే ఆదేశాలు గతంలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని కచ్చితంగా అమలు చేయాలని, అలా చేయని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. 20 రోజుల్లోపు ఆరోగ్యశ్రీ, 10 రోజుల్లోపు రైస్ కార్డు, 21 రోజల్లోపు పెన్షన్ కార్డు, 90 రోజుల్లొపు ఇంటి పట్టాలు , దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తానికి కొత్త నిబంధనలతో సచివాలయ ఉద్యోగులు కాస్త ఇబ్బంది పడినా.. అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతుందని అంటున్నారు.