https://oktelugu.com/

వ్యాక్సిన్ పై మరో గొప్ప శుభవార్త

దేశంలో వ్యాక్సినేషన్ మొదట వైద్యులు, సిబ్బందికి వేశారు. ఆ తర్వాత 60ఏళ్లపైన వృద్ధులకు.. ఆ తర్వాత 45 ఏళ్ల పైనవారికి.. ఇప్పుడు 18-45 ఏళ్ల వారికి.. మరి పిల్లల సంగతి ఏంటి? వారి చదువులు ఏం కావాలి? అని మథన పడుతున్న తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా మరో శుభవార్త అందింది. జైడస్ క్యాడిలా టీకా ట్రయల్స్ దాదాపు పూర్తి అయ్యాయని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరోరా సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు కల్లా 12-18 ఏళ్ల […]

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2021 9:54 am
    Follow us on

    దేశంలో వ్యాక్సినేషన్ మొదట వైద్యులు, సిబ్బందికి వేశారు. ఆ తర్వాత 60ఏళ్లపైన వృద్ధులకు.. ఆ తర్వాత 45 ఏళ్ల పైనవారికి.. ఇప్పుడు 18-45 ఏళ్ల వారికి.. మరి పిల్లల సంగతి ఏంటి? వారి చదువులు ఏం కావాలి? అని మథన పడుతున్న తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా మరో శుభవార్త అందింది.

    జైడస్ క్యాడిలా టీకా ట్రయల్స్ దాదాపు పూర్తి అయ్యాయని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరోరా సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు కల్లా 12-18 ఏళ్ల వారికి టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా పిల్లలకు త్వరలోనే టీకాలు వేసేందుకు రంగం సిద్దమవుతోందన్నారు. ఆరు నెలల్లో విద్యార్థులకు టీకాలు వేయడం పూర్తి చేసి విద్యార్థుల చదువులను పట్టాలెక్కించాలని కేంద్రం కూడా చూస్తోంది.

    మరోవైపు భారత్ బయోటెక్ కూడా 2-18 ఏళ్లలోపు వారికి టీకా ప్రయోగాలు చేస్తోంది. రెండు, మూడో దశ ట్రయల్స్ ను పూర్తి చేసింది. ఈ వ్యాక్సిన్ సైతం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతోంది.

    ఇక ఇవే కాదు.. అమెరికాకు చెందిన ఫైజర్, జైడస్ క్యాడిలా కూడా పిల్లలకు ఇచ్చే టీకాలను ఇప్పటికే అమెరికాలో వేస్తున్నాయి. అవి కూడా వస్తే దేశంలో పిల్లలకు వేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే జరిగితే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అయినా దేశంలోని పిల్లలకు టీకాలు పడి మళ్లీ పాఠశాలలు తెరవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.