
కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, సమిష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ఛీప్ గా నియామకమైన ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తన పాదయాత్ర ఉండే అవకాశం ఉందని తెలిపారు.