
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామ వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వం తెస్తున్న పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు వీరిని నియమించారు. ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం వారికి గుడ్‌న్యూస్ అందించింది. మరో ఏడాది పాటు వారి సేవలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు జగన్ సర్కార్ నవర్నాలు పథకాన్ని తీసుకొచ్చింది. అందులోభాగంగా లబ్ధిదారులకు పథకాలను చేరువ చేసేందుకు డెలివరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కట్టుబడి.. గ్రామగ్రామాన 50 నుంచి 100 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించింది. లబ్ధిదారుల కులం, జాతి, మతం, లింగ భేదాలు లేకుండా గడప వద్దకే స్కీంలు తీసుకెళ్లడానికి వారిని సెలక్ట్ చేశారు.
Also Read: ఏపీలో పాగా వేసుడే బీజేపీ టార్గెటా?
పారదర్శకత, అవినీతిరహితంగా వీరు సేవలు అందిస్తున్నారని ప్రభుత్వం కూడా భావించింది. అందుకే మరో ఏడాది పాటు వీరి సేవలను వినియోగించుకోవాలనుకుంది. 2019 ఆగస్టు 15న ఏడాదిపాటు సేవల కోసం వీరిని నియమించారు. ఇప్పుడు మరో ఏడాది వారి ఉద్యోగ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని వెంటనే అమల్లోకి తెస్తున్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను సైతం భర్తీ చేయడానికి వెంటనే సంబంధిత అధికారులకు అనుమతులు ఇచ్చారు. మొదటి స్పెల్‌లో స్థానం పొందిన గ్రామ/వార్డు వాలంటీర్లకు ఆగస్టు 14 నాటికి పదవీ కాలం ముగిసింది.
Also Read: టీటీడీ ఈవోను బదిలీ చేసిన జగన్.. అసలు కారణం అదేనా?
ప్రస్తుతం రాష్ట్రంలో వీరు 2.6 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ఖజానాకు రూ.1560 కోట్లు ఖర్చవుతోంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహించింది. అంటే.. ఇప్పటివరకు ఉన్న వాలంటీర్లతో పాటు ఈ సంఖ్య అదనం.